By: ABP Desam | Updated at : 18 Apr 2023 04:11 PM (IST)
Image Credit:Samantha/Instagram
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల నటించిన చిత్రం ‘శాకుంతలం’. స్టార్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మార్చి 30 న విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంటోంది. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ మూవీకు అనుకున్నంతగా ఆదరణ లభించడం లేదు. దీంతో మూమీ టీమ్ తో పాటు నటి సమంత కూడా విమర్శలు ఎదుర్కొంటుంది. గత కొన్ని రోజులుగా సమంతపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు కూడా వచ్చాయి. డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని, స్టార్ డమ్ పడిపోయిందని విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సమంత ‘శాకుంతలం’ నెగిటివ్ రిజల్ట్ తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ప్రేరణతో ఈ మూవీను తెరకెక్కించారు దర్శకుడు గుణశేఖర్. స్క్రిప్ట్ పరంగా ఈ మూవీ బాగానే ఉన్నా దాన్ని తెరపైన చూపించడంలో దర్శకుడు విఫలమయ్యారనే వార్తలు వస్తున్నాయి. దీంతో మూవీ విడుదల రోజు నుంచే విమర్శలు మొదలైయ్యాయి. కథ, కథనం, గ్రాఫిక్స్ వర్క్ పై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సమంత నటన పై కూడా కాస్త వ్యతిరేకత వచ్చింది. వెరసి ఈ సినిమా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
‘శాకుంతలం’ రిజల్ట్ పై సమంత పోస్ట్
‘శాకుంతలం’ సినిమా, అలాగే సమంతపై వస్తోన్న విమర్శలపై తాజాగా సమంత స్పందించింది. అయితే నేరుగా విషయం చెప్పకుండా ఇండైరెక్ట్ గా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. భగవద్గీతలోని ఓ శ్లోకాన్ని షేర్ చేసింది. ‘‘కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతూర్భూ మా తే సంగోత్సవ ఆకర్మణి’’ అంటూ రాసుకొచ్చింది. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే.. ‘‘పని చేయడం మాత్రమే మన పని. అంతేకాని దాని ఫలితంతో మనకు సంబంధం లేదు. ప్రతిఫలం కోసం ఏ పని చేయకూడదు. అలాగని పని చేయడం మానేయకూడదు’’. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఇది కచ్చితంగా ‘శాకుంతలం’ రిజల్ట్ పట్ల సమంతపై వస్తోన్న విమర్శలకు సమాధానంగానే ఈ శ్లోకాన్ని షేర్ చేసిందంటున్నారు. ఇటీవల సమంతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నిర్మాతకు సమాధానంగా ఈ పోస్టు పెట్టి ఉండవచ్చని మరికొందరు అనుకుంటున్నారు.
సమంత పోస్ట్.. ఆ నిర్మాతకు సమాధానమా?
నటి సమంత పై గత కొన్ని రోజులుగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ‘శాకుంతలం’ రిజల్ట్ ను కూడా సమంతకు ఆపాదించి మరీ విమర్శలు చేస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు సమంతను ఫ్లాప్ క్వీన్, ఇక తన పని అయిపోయింది అంటూ ట్వీట్ చేశారు. అలాగే టాలీవుడ్ నుంచి నిర్మాత చిట్టి బాబు సమంత పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత పని అయిపోయిందని. ఆమెకు హీరోయిన్ గా గ్రాఫ్ తగ్గిపోయిందని అన్నారు. మొన్నటి వరకూ సెంటిమెంట్ తో డ్రామాలు ఆడి క్యాష్ చేసుకుందని, అస్తమాను డ్రామాలు వర్కౌట్ కావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే సమంత కౌంటర్ గా ఆ పోస్ట్ చేసిందని అంటున్నారు.
Read Also: ఓటీటీలోకి రవితేజ ‘రావణాసుర’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!
Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ
సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!
Arjun Kapoor-Malaika Arora: బెడ్పై అర్ధనగ్నంగా బాయ్ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!
‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్
Sharmila Meet Sivakumar : మరోసారి డీకే శివకుమార్తో షర్మిల భేటీ - కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?
Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్మెంట్ రేపే!
Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి