Payal Rajput: ‘మంగళవారం‘ కోసం అంత రిస్క్ చేసిందా? అసలు విషయం బయటపెట్టిన హాట్ బ్యూటీ!
బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’. ఈ మూవీ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిందట. కిడ్నీ సమస్య వేధిస్తున్నా రిస్క్ తీసుకుని షూటింగ్ లో పాల్గొన్నట్లు వెల్లడించింది.
‘RX100’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’. గ్లామర్ క్వీన్ పాయల్ రాజ్‌పుత్, రంగం ఫేమ్ అజ్మల్ అమిర్ జంటగా నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న సినిమా విడుదలకు సిద్దమవుతున్నది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచాయి. అసలు సినిమా టైటిలే చాలా కొత్తగా ఆసక్తి కలిగిస్తోంది. ‘మహాసముద్రం’ చిత్రంతో ఘోర పరాభవాన్ని చవిచూసిన ఆయన ఇప్పుడు ‘మంగళవారం’ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం వరుస అప్ డేట్స్ తో సినిమాపై అంచనాలు పెంచుతోంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి తాజాగా విడుదల చేశారు. ఈ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది.
రిస్క్ తీసుకుని సినిమా చేశా- పాయల్
ఇక ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో నటి పాయల్ రాజ్ పుత్ కీలక విషయాలు వెల్లడించింది. ఈ సినిమా కోసం తాను తీసుకున్న రిస్క్ గురించి వివరించింది. “ ‘RX100’ సినిమాతో అజయ్ భూపతి నన్ను హీరోయిన్ గా పరియయం చేశారు. ఈ సినిమా నా కెరీర్ ను కీలక మలుపు తిప్పింది. ఇప్పుడు 'మంగళవారం' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కథ వినగానే సినిమా చేయాలి అనుకున్నాను. 6 నెలల క్రితం షూటింగ్ అని చెప్పారు. కానీ, ఆ సమయంలో నా హెల్త్ బాగాలేదు. కిడ్నీ సమస్య మరింత తీవ్రం అయ్యింది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. ఈ విషయం అజయ్ కి చెప్పాను. కానీ, తను మాత్రం కచ్చితంగా సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పారు. సినిమాలో నటించాలా? వద్దా? అనే నిర్ణయం మీరే తీసుకోవాలి అన్నారు. ఈ సినిమాను వదులుకోవడం ఇష్టం లేదు. అందుకే రిస్క్ చేసి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను. సినిమా అయ్యాయే సర్జరీ చేయించుకోవాలి అనుకున్నాను. ఈ సినిమా నా కెరీర్ కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటాను ” అని వెల్లడించింది.
హిట్ కోసం ఎదురు చూస్తున్న పాయల్, అజయ్
పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత, అజ్మల్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ముద్ర మీడియా వర్క్స్, A క్రియేటీవ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘RX100’తో సంచలనం విజయాన్ని అందుకున్న అజయ్ భూపతి.. ‘మహా సముద్రం’ చిత్రంతో డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ‘మంగళవారం’ చిత్రంతో మరోసారి తన సత్తా చాటుకోవాలి అనుకుంటున్నాడు. ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.
Read Also: ‘టైగర్ నాగేశ్వరరావు’ రన్ టైమ్ కుదించిన మేకర్స్, కారణం అదేనట!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial