అన్వేషించండి

Tiger Nageswara Rao: ‘టైగర్ నాగేశ్వరరావు’ రన్ టైమ్ కుదించిన మేకర్స్, కారణం అదేనట!

రవితేజ తాజా చిత్రం ‘టైగర్ నాగేశర్వరరావు’ రన్ టైమ్ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు అరగంట పాటు నిడివి తగ్గించారు. కొత్త రన్ టైమ్ ను అధికారికంగా వెల్లడించారు.

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. భారీగా అంచనాల నడుమ ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న పలు భాషల్లో విడుదల అయ్యింది. ఈ సినిమా తొలి షో నుంచి మంచి టాక్ సంపాదించుకుంది. ‘టైగర్ నాగేశర్వరరావు’ క్యారెక్టర్ కు రవితేజ తన అద్భుత నటనతో నూటికి నూరుశాతం న్యాయం చేశాడనే టాక్ వినిపిస్తోంది. రవితేజ పాత్రను అద్భుతంగా ప్రజెంట్ చేయడంలో మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. స్టువర్టుపురం గజదొంగ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ‘లియో’, ‘భగవంత్ కేసరి’ లాంటి పెద్ద సినిమాలతో పోటీ పడిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది.

‘టైగర్ నాగేశర్వరరావు’ రన్ టైమ్ కుదింపు

ఇక ఈ సినిమా రన్ టైమ్ కు సంబంధించి మొదటి నుంచి పెద్ద చర్చ జరిగింది. తొలుత ఈ సినిమా రన్ టైమ్ ను చిత్రబృందం 3 గంటలుగా నిర్ణయించింది. అయితే, తొలి షో తర్వాత సినిమా నిడివి మరింత తగ్గించవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొన్ని సీన్లను మరింత క్రిస్ప్ గా మార్చవచ్చు అనే టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చిత్రబృందం సినిమా నిడివిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ‘టైగర్ నాగేశ్వరరావు’ డ్యురేషన్ మూడు గంటలు ఉండగా, ఇప్పుడు సుమారు అరగంట పాటు తగ్గించింది. 2 గంటల 37 నిమిషాల నిడివితో సరికొత్తగా ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Abhishek Agarwal Arts (@aaartsofficial)

రవితేజ కెరీర్ లో సరికొత్త రికార్డు

తాజా రన్ టైమ్ తో సినిమా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం భావిస్తోంది. కొన్ని సీన్లు తీసేయడంతో సినిమా మరింత సూటిగా ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంటుందంటున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరికొత్తగా కనిపించాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు కూడా అద్భుతంగా ఉన్నాయంటున్నారు.  మొదటిసారి రవితేజ కెరీర్ లో అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ సరికొత్త రికార్డు సృష్టించింది.

యువ దర్శకుడు వంశీ తెరపైకి తీసుకు వచ్చిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను  ఇదే సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటించారు.   భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పకుడిగా వ్యవహరించారు. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషించారు.

Read Also: 3 భాగాలుగా ‘మహా భారతం‘- బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన నిర్ణయం

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bigg Boss Rohini: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
Telangana: మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Embed widget