అన్వేషించండి
Advertisement
Venkatesh: హ్యాపీ బర్త్ డే వెంకీ.. ఖుషీఖుషీగా ఖుష్భూ విషెస్.. ఎమోషనల్ ట్వీట్
వెంకీ ఈరోజు 61వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వెంకీకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
తన వయసుకి తగినట్లుగా.. వైవిధ్యమైన పాత్రలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు విక్టరీ వెంకటేష్. ఈ ఏడాదిలో 'నారప్ప', 'దృశ్యం 2' వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన వెంకీ ఈరోజు 61వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వెంకీకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం వెంకీకి విషెస్ చెబుతూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
తాజాగా నటి ఖుష్బూ.. వెంకటేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. వీరిద్దరూ కూడా తెలుగులో 'కలియుగ పాండవులు' అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని తన పోస్ట్ లో ప్రస్తావించింది కుష్బూ. వెంకీకి విషెస్ చెబుతూ.. నీ విషయంలో నేను చాలా సెంటిమెంట్ ఫీల్ అవుతానని.. ఇద్దరం కలిసి ప్రయాణం మొదలుపెట్టాం.. 35 ఏళ్ల తరువాత ఇప్పటికీ కూడా ఒకరిపైమరొకరికి ప్రేమ, గౌరవం అనేవి పోలేదని ఎమోషనల్ గా రాసుకొచ్చింది.
View this post on Instagram
మరోపక్క వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తోన్న వెబ్ సిరీస్ లో వెంకీ పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. అందులో నెరిసిన జుట్టు, గడ్డం, చెవి పోగుతో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు వెంకీ. ఇందులో ఆయన రానా నాయుడు అనే పాత్ర పోషిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ సిరీస్ లో రానా కూడా నటించబోతున్నారు.
Inthaki emocchu?
— Netflix India South (@Netflix_INSouth) December 13, 2021
Friends tho unna, family tho unna, ontariga unna Venky Mama cinemalu enjoy cheyadam vacchu.
Any genre, any emotion, single name.
Happy Birthday @VenkyMama🎉🥳 #HappyBirthdayVictoryVenkatesh pic.twitter.com/zkq0skPoi9
Also Read:సమంత ఐటెం సాంగ్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్..
Also Read:బన్నీతో సమంత 'నాటు' స్టెప్.. ఊరమాస్ ఉందే..
Also Read: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
కర్నూలు
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion