అన్వేషించండి

Chitram Chudara First Look: ‘చిత్రం చూడర’ అంటున్న వరుణ్ సందేశ్, ఆసక్తికరంగా కొత్త సినిమా టైటిల్

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటిస్తోన్న కొత్త మూవీ ‘చిత్రం చూడర’ . ఇటీవలే ఈ మూవీకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో కొంతమంది మొదటి రెండు మూడు సినిమాలతోనే స్టార్డమ్ తెచ్చుకుంటారు. ఇంకొంత మంది పదుల సంఖ్యలో సినిమాలు చేస్తే తర్వాత స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇంకొంత మందికి హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నా స్టార్ హీరోగా మారే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇందులో మూడో కోవలోకి వస్తాడు టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్ లు అందుకుని తర్వాత సరైన హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న హీరోల్లో వరుణ్ సందేశ్ కూడా ఉన్నాడు. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన మరో కొత్త సినిమాలో నటిస్తున్నారు. అదే ‘చిత్రం చూడర’. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను వరుణ్ సందేశ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. 

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్ లో పోలీస్ స్టేషన్ లో వరణ్ సందేశ్ తో పాటు ధనరాజ్, కాశీ విశ్వనాథ్ కూర్చొని ఉన్నారు. వారి ఎదురుగా ఓ పోలీస్ లాఠీ పట్టుకుని నిలుచున్నట్టు కనిపిస్తున్నాడు. విచారణ కోసం వారిని స్టేషన్ లో ఉంచినట్టు కనిపిస్తోంది. ఈ ‘చిత్రం చూడర’ సినిమాకు ఆర్ ఎన్ హర్షవర్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీ పై ఉత్కంఠ పెరిగింది. అలాగే ఈ సినిమాలో అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ తదితరులు తెరపై కనిపించనున్నారు. అంతే కాకుండా ‘నేనింతే’ మూవీ ఫేమ్ అతిథి గౌతమ్ ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ను చేయబోతున్నట్టు తెలుస్తోంది.

2007 లో వచ్చిన ‘హ్యపీ డేస్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ సందేశ్. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ హిట్ కావడంతో తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ యూత్ ఫేవరేట్ మూవీలలో ఈ సినిమా కూడా ఉంటుంది. అంతగా యూత్ ను అట్రాక్ట్ చేసింది ఈ సినిమా. ఈ మూవీ తర్వాత వరుణ్ కు అంతగా హిట్ మళ్లీ రాలేదు. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు వరుణ్. అయినా ఆయనకు సరై హిట్ ఇప్పటి వరకూ పడలేదు. దీంతో ఎలాగైనా ఈ సారి హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడట వరుణ్. అందుకే ఈ ‘చిత్రం చూడర’ సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడట. మరి వరుణ్ ఈ సినిమాతోనైనా సక్సెస్ ట్రాక్ లో పడతాడో లేదో చూడాలి. ఈ సినిమాను బి ఎం సినిమాస్ బ్యానర్ లో శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మీ నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు రాధన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varun Sandesh (@itsvarunsandesh)

టాప్ హెడ్ లైన్స్

Vrushakarma Trailer Review : సృష్టి ధర్మాన్ని కాపాడే 'వృషకర్మ' వచ్చేశాడు - ఊహకందని ఊహించని మరో ప్రపంచం... ట్రైలర్ రివ్యూ
సృష్టి ధర్మాన్ని కాపాడే 'వృషకర్మ' వచ్చేశాడు - ఊహకందని ఊహించని మరో ప్రపంచం... ట్రైలర్ రివ్యూ
Gundeninda Gudigantalu Nov 26: కుంగుబాటులో ఆస్పత్రిలో చేరిన సుమతి..పలకరించకడానికి వచ్చిన అరుణ్‌తో గొడవపడిన బాలు
గుండెనిండా గుడిగంటలు:కుంగుబాటులో ఆస్పత్రిలో చేరిన సుమతి..పలకరించకడానికి వచ్చిన అరుణ్‌తో గొడవపడిన బాలు
Podarillu Serial Today NoV 26: విక్కీ మాటలకు బాధపడి మహాపై కోప్పడిన చక్రి...అన్నయ్య చెప్పిన అబద్ధం కన్నా చెప్పగా మహా రివర్స్‌లోచక్రిని తిడుతుంది
పొదరిల్లు: విక్కీ మాటలకు బాధపడి మహాపై కోప్పడిన చక్రి...అన్నయ్య చెప్పిన అబద్ధం కన్నా చెప్పగా మహా రివర్స్‌లోచక్రిని తిడుతుంది
Illu Illalu Pillalu Serial Today November 26th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని చూడటానికి వెళ్లిన రామరాజు, వేదవతి! ధీరజ్‌ని తికమక పెట్టేసిన చందు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లీని చూడటానికి వెళ్లిన రామరాజు, వేదవతి! ధీరజ్‌ని తికమక పెట్టేసిన చందు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
YS Sharmila vs K Kavitha: ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?
ఇద్దరు ఆడబిడ్డల తిరుగుబాటు సెగ.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కుటుంబ సమస్యలే పెద్ద తలనొప్పిగా మారాయా?
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Meerut Police Half Encounter: యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget