అన్వేషించండి
Advertisement
Karthikeya: 'నేను పెద్దయ్యాక హీరో అవుతా.. చిరంజీవి కూడా నా పెళ్లికి వస్తాడు..' చెప్పిందే జరిగింది.. కార్తీకేయ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవితో కలిసి కార్తికేయ-లోహిత కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఫొటోలను షేర్ చేసిన కార్తికేయ.. ఓ ట్వీట్ చేశాడు.
యంగ్ హీరో కార్తికేయ రీసెంట్ గా తను ప్రేమించిన లోహితను వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ లో నవంబర్ 21న వీరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పాయల్ రాజ్ పుత్, తనికెళ్ల భరణి, సాయి కుమార్ లతో పాటు సినీ పెద్దలు అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి లాంటి ప్రముఖులు పెళ్లికి విచ్చేసి.. కొత్త దంపతులను దీవించారు.
మెగాస్టార్ చిరంజీవితో కలిసి కార్తికేయ-లోహిత కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఫొటోలను షేర్ చేసిన కార్తికేయ.. ఓ ట్వీట్ చేశాడు. ''నేను పెద్దయ్యాక హీరో అవుతా.. అప్పుడు చిరంజీవి కూడా నా పెళ్లికి వస్తాడు'' అని చిన్నప్పుడు ఎంతో అమాయకంగా అనేవాడినని చెప్పాడు. ఇప్పుడు తను హీరో అయ్యానని అలానే చిరంజీవి తనను ఆశీర్వదించడానికి వచ్చారని.. ఆయనపై ఎప్పటినీ అంతులేని ప్రేమాభిమానాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు.
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కెరీర్ విషయానికొస్తే.. 'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ.. ఆ తరువాత 'గుణ 369', 'చావు కబురు చల్లగా' వంటి సినిమాల్లో నటించాడు. హీరోగా అతడికి సరైన విజయాలు రావడం లేదు. రీసెంట్ గా 'రాజా విక్రమార్క' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఓ పక్క హీరోగా నటిస్తూనే.. మరోపక్క విలన్ రోల్స్ లో మెప్పిస్తున్నాడు కార్తికేయ. ప్రస్తుతం ఈ హీరో తమిళంలో 'వాలిమై' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన విలన్ గా కనిపించనున్నాడు.
“Nen pedhayaka hero avtha appudu Chiranjeevi kuda na pelli ki vasthadu”
— Kartikeya (@ActorKartikeya) November 23, 2021
I said this as a an innocent kid. Thankful to fate I am an actor now and my MEGASTAR @KChiruTweets garu was there to bless me. Your presence means alot to me sir🤩
Love you to the infinity as always ❤ pic.twitter.com/nlxzqbCeGV
Also Read:మహేష్ ను ఆడేసుకున్న ఎన్టీఆర్.. ప్రోమో వచ్చేసింది..
Also Read: బ్రేకింగ్ న్యూస్... సుబ్బరాజు, జె.డి. చక్రవర్తితో రెజీనా సినిమా... షూటింగ్ షురూ
Also Read: సుమ సినిమాలో ఓ ప్రేమ పాట... ఎవరి మీద తీశారు? ఎవరు విడుదల చేశారంటే?
Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement