Regina Cassandra: బ్రేకింగ్ న్యూస్... సుబ్బరాజు, జె.డి. చక్రవర్తితో రెజీనా సినిమా... షూటింగ్ షురూ
తెలుగులో హీరోయిన్ రెజీనా మరో సినిమాకు 'ఎస్' చెప్పారు. సోమవారం కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు.
రెజీనా కాసాండ్ర ప్రధాన పాత్రలో ప్రారంభమైన తెలుగు సినిమా 'బ్రేకింగ్ న్యూస్'. దీనికి సుబ్బు వేదుల దర్శకుడు. రా ఎంటర్‌టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెజీనాతో పాటు హీరో జె.డి. చక్రవర్తి, నటుడు సుబ్బరాజు ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా షూటింగ్‌ను సోమవారం హైదరాబాద్ స్టార్ట్ చేశారు.
"ఇదొక సోషల్ సెటైరికల్ సినిమా. ప్రస్తుత సమాజంలో పరిస్థితులపై వాస్తవిక కోణంలో... ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు సుబ్బు వేదుల కథ రెడీ చేశారు. అదే విధంగా సినిమా తెరకెక్కిస్తున్నారు. సోమవారం ప్రారంభమైన షెడ్యూల్ డిసెంబర్ మూడో వారం వరకూ కొనసాగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్నాం" అని నిర్మాణ సంస్థలు తెలిపాయి. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత బి.వి.ఎస్. రవి కథ అందించగా... కళ్యాణ్ వర్మ, వంశీ బలపనూరి, సుబ్బు వేదుల, సందీప్ గాదె స్క్రీన్ ప్లే రాశారు. ఝాన్సీ, సురేశ్ తదితరులు నటిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి గాయని, నటి కౌముది నేమని ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
'బ్రేకింగ్ న్యూస్'తో పాటు తెలుగులో రెజీనా మరో సినిమా చేస్తున్నారు. నివేదా థామస్, ఆమె ప్రధాన పాత్రల్లో సుధీర్ వర్మ 'శాకిని డాకిని' సినిమా తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'లో స్పెషల్ సాంగ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో 'నేనే నా' సినిమా చేస్తున్నారు. మరికొన్ని తమిళ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఖాళీ సమయాల్లో రెజీనా ట్రెకింగ్, సైక్లింగ్ చేస్తున్నారు. సరదాగా అప్పుడప్పుడూ చెట్లు ఎక్కుతున్నారు.
View this post on Instagram
Also Read: 'థాంక్యూ'... రంగుల రాట్నంలో గుర్రం ఎక్కిన నాగచైతన్య!
Also Read: సినిమాతో పాటు దర్శకుడి మాటలు వినిపిస్తే? ఇండియాలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన దేవ్ కట్టా 'రిపబ్లిక్'
Also Read: అవన్నీ వదంతులే... కైకాల సత్యనారాయణ తాజా ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె స్పందన ఇది
Also Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య
Also Read: 'కె.జి.యఫ్' రేంజ్‌లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?
Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి