అన్వేషించండి

Brahmaji: 'అంకుల్ ఏంట్రా అంకుల్, కేసు వేస్తా' - బ్రహ్మాజీ కామెడీ పంచ్!

కాసేపటి క్రితం ట్విట్టర్ లో నటుడు బ్రహ్మాజీ ఒక ఫొటోని షేర్ చేసి.. 'ఏం జరుగుతోంది..?' అని ట్వీట్ వేశారు.

రీసెంట్ గా హాట్ యాంకర్ అనసూయని ట్విట్టర్ లో కొందరు నెటిజన్లు ఆంటీ అని పిలిచినందుకు ఆమె కేసు వేస్తానని చెప్పడం హాట్ టాపిక్ అయింది. దీనిపై చాలా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఒకరోజు మొత్తం ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఆంటీ అని పిలిస్తే వేధించినట్లేనని అనసూయ చెప్పడంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయి ట్వీట్లు వేశారు. అయితే ఇప్పుడు నటుడు బ్రహ్మాజీ ఈ టాపిక్ పై పరోక్షంగా ఓ జోక్ చేశారు. 

కాసేపటి క్రితం ట్విట్టర్ లో ఆయన ఒక ఫొటోని షేర్ చేసి.. 'ఏం జరుగుతోంది..?' అని ట్వీట్ వేశారు. దానికి ఓ నెటిజన్ 'ఏం లేదు అంకుల్' అని బదులిచ్చాడు. అది చూసిన బ్రహ్మాజీ 'అంకుల్ ఏంట్రా అంకుల్.. కేసు వేస్తా.. ఏజ్.. బాడీ షేమింగా..?' అంటూ ఫన్నీ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మరింత ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 'మీరు ఎన్ని కేసులు వేస్తానని చెప్పినా, ఫలానా ఆంటీ గారికి వచ్చినంత అటెన్షన్ మాత్రం మీకు రాదు బ్రహ్మాజీ గారు' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేశారా..? అయితే ఎన్ని కేసులు పెడతారు సార్..?' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. 

అసలు ఈ 'ఆంటీ' హ్యాష్ ట్యాగ్ సంగతేంటంటే.. రెండు, మూడు రోజుల క్రితం ''అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ... కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా'' అంటూ ఒక ట్వీట్ వేశారు అనసూయ. 'లైగర్' ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని అనసూయ ఆ ట్వీట్ చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల ఫీలింగ్. ఆ తర్వాత మళ్లీ అనసూయ మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది. తనను తిడుతున్న తిట్లు అన్నీ వాళ్ల హీరోలకు పంపిస్తున్నాని పేర్కొన్నారు. ఇవాళ తనను తిడుతున్న ట్వీట్లను స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నానని, ఆంటీ అని పిలిచినందుకు కేసులు పెడతానని హెచ్చరించారు.

అనసూయ కేసు పెడతానని హెచ్చరించిన తర్వాత డిస్కషన్ 'జబర్దస్త్' మీదకు మళ్లింది. 'జబర్దస్త్'లో వేసే డబల్ మీనింగ్ జోకులకు నవ్వుతున్నావ్. దానికి మేడమ్ అని పిలవాలా?' అని ఒక నెటిజన్ ట్వీట్ చేస్తే... 'మీకు అంత ధైర్యం ఉంటే షో చేసే వాళ్ల మీద పడండి. తప్పును తప్పు చెప్పే నా మీద పడటం మీ చేతకానితనం. అయినా మూవీలో వాడితే హీరో.... టీవీలో వాడితే చీప్'' అని రిప్లై ఇచ్చారు. ఆంటీ అంటే కేసు పెట్టవచ్చని ఆమె తెలిపారు. 

అనసూయ వ్యాఖ్యల వెనుక ఎవరో ఉన్నారని, కావాలని సమస్యను పెద్దది చేయడానికి ప్రయత్నిస్తున్నాని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు. అందుకు 'నా వెనకాల ఎవరున్నారని నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను' అని అనసూయ పేర్కొన్నారు. అంతే కాదు... అబ్యూజ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్న ప్రతి ఒక్కరి ట్వీట్‌ను కోట్ చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Embed widget