Abishek Ambareeshs Reception: నటి సుమలత కొడుకు రిసెప్షన్ వేడుకలో చిరంజీవి ఫ్యామిలీ సందడి
ఇటీవల అభిషేక్-అవివల వివాహం బెంగళూరులో సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం జూన్ 7న అభిషేక్-అవివ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు.
Abishek Ambareeshs Reception: సీనియన్ నటి సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్ వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తాను ప్రేమించిన అమ్మాయి అవివి బిద్దప్ప మెడలో మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అభిషేక్-అవివల వివాహం బెంగళూరులో సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం బుధవారం(జూన్ 7) న అభిషేక్-అవివ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హాజరైన సినీ ప్రముఖులు..
అభిషేక్ అంబరీష్-అవివ బిడప్ప ల రిసెప్షన్ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి పలువరు ప్రముఖుల రాకతో మరింత సందడిగా మారింది. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ ఈ ఈవెంట్ లో కనిపించారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా, ‘కేజీఎఫ్’ స్టార్ హీరో యష్, సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆయన సతీమణి లతతో కలసి రిసెప్షన్ వేడుకలో కనిపించారు. కన్నడ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కిచ్చ సుదీప్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అలాగే ఖుష్బూ సుందర్, జాకీ ష్రాఫ్, దర్శన్ తూగుదీప, దివ్య స్పందన ఇంకా చాలా మంది ఉన్నారు. అభిషేక్ రిసెప్షన్ లో సినీ నటుల రాకతో వేడుక మరింత సందడిగా మారింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ రిసెప్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. చిరంజీవి సుమలత కలసి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ‘చట్టంతో పోరాటం’, ‘వేట’, ‘రాక్షసుడు’, ‘శుభలేఖ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘స్వయంకృషి, ‘ఖైదీ’, ‘శ్రీ మంజునాథ’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో సుమలతతో జత కట్టారు చిరంజీవి.
సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా ఈ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య కొత్త జంటను ఆశీర్వదించారు. అలాగే పలువురు నాయకులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. సినీ రాజకీయ నాయకుల కలయికతో సినిమా, రాజకీయాలకు ఉన్న సంబంధాలు, ప్రస్తుత రాజకీయాల గురించి కాసేపు ముచ్చటించారు.
రాజకీయాల్లో బిజీగా..
ఇక సీనియర్ నటి సుమలత విషయానికొస్తే.. సుమలతకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులోనూ పదుల సంఖ్యలో సినిమాలు చేసి అభిమానుల్ని సొంతం చేసుకుంది. సుమలత కన్నడ నటుడు అంబరీష్ ను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయ్యారు. సుమలత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆమె భర్త అంబరీష్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. దీంతో సుమలత కూడా భర్త బాటలోనే రాజకీయాల్లో కొనసాగుతోంది. ఆమె 2019 ఎన్నికల్లో కర్ణాటక లో మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీ గా గెలుపొందినది.ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటున్నారు సుమలత.
Also Read: అభిమానుల చేతుల మీదుగా 'భగవంత్ కేసరి' టీజర్ - ఎన్ని థియేటర్లలో తెలుసా?
#AbiVa 's Reception #AbhishekAmbareesh #AvivaBidappa @siddaramaiah @dasadarshan @divyaspandana #Megastar #Chiranjeevi #Sumalatha #Darshan #ChallengingStarDarshan #DarshanThoogudeepa #PrakashBidappa pic.twitter.com/Gm5F4OvvbL
— Raghavendra Adiga (@RaghavendraAdig) June 7, 2023