News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

అభిమానుల చేతుల మీదుగా 'భగవంత్ కేసరి' టీజర్ - ఎన్ని థియేటర్లలో తెలుసా?

అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'భగవంత్ కేసరి' మూవీ టీజర్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్.

FOLLOW US: 
Share:

నటసింహ నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య ఇప్పుడు యువ హీరోలకు దీటుగా వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీబిజీగా మారుతున్నాడు. ఇక ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే జూన్ 10న బాలయ్య పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ని అందిస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఈ సినిమా టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు. 'భగవంత్ కేసరి' అనే పవర్ఫుల్ టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు మేకర్స్. 'ఐ డోంట్ కేర్' అనేది ట్యాగ్ లైన్. టైటిల్ తో పాటు పోస్టర్లో బాలయ్య లుక్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో ఫాన్స్ టైటిల్ పోస్టర్ తో ఫుల్ ఖుషి అయ్యారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ను అందించారు మేకర్స్.

జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా 'భగవంత్ కేసరి' టీజర్ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ మేరకు జూన్ 10న ఉదయం 10:11 గంటలకు ఈ టీజర్ ని ప్రపంచవ్యాప్తంగా 108 థియేటర్స్ లో  ప్రదర్శించబోతున్నారు. అంతేకాదు ఫ్యాన్స్ చేతుల మీదగానే ఈ టీజర్ విడుదల కానుంది. ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఇక ఈ అప్డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. బాలయ్య సినిమాకు సంబంధించిన ఓ టీజర్  ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి. దీంతో ఇప్పటినుంచే అభిమానులు 'భగవంత్ కేసరి' టీజర్ ని థియేటర్స్ లో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అభిమానుల అంచనాలకు తగ్గట్టు తన బ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడా మిస్ అవ్వకుండా ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలివెంట్స్ ఓ రేంజ్ లో ఉండేలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

ఇక టీజర్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో చూపించనునట్లు తెలుస్తోంది. కంప్లీట్ తెలంగాణ నేటివిటీ బ్యాక్ డ్రాప్ తోనే ఈ సినిమా ఉండబోతుందట. సినిమాలో బాలయ్య తెలంగాణ యాసలో చెప్పే డైలాగులు కూడా ఓ రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీ లీల బాలయ్య కూతురుగా కనిపించనుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. సైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 20న దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా అనంతరం వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీతో 109వ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా బాలయ్య పుట్టినరోజు జూన్ 10న రానుంది.

Also Read: అందుకే సీరియల్స్ మానేశా, రవి నా కంటే ముందే ప్రయత్నించాడు: నటి నవ్య స్వామి

View this post on Instagram
 
A post shared by Anil Ravipudi (@anilravipudi)

Also Raed: 

Published at : 08 Jun 2023 07:51 PM (IST) Tags: NBK108 Bhagavanth Kesari Movie Teaser Balakrishna Bhagavanth Kesari Movie Anil Ravipudi Balakrishna

ఇవి కూడా చూడండి

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Vishal: సెన్సార్ బోర్డ్‌కు రూ.6.5 లక్షల లంచం ఇచ్చా - ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నా: విశాల్

Vishal: సెన్సార్ బోర్డ్‌కు రూ.6.5 లక్షల లంచం ఇచ్చా - ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నా: విశాల్

Nayanthara: వామ్మో లేడీ సూపర్ స్టార్, 50 సెకండ్ల యాడ్ కోసం నయన్ అంత తీసుకుంటుందా?

Nayanthara: వామ్మో లేడీ సూపర్ స్టార్, 50 సెకండ్ల యాడ్ కోసం నయన్ అంత తీసుకుంటుందా?

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !