Laal Singh Chaddha Postponed: యష్, విజయ్, షాహిద్ ఫ్యాన్స్ హ్యాపీ! ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం నాట్ హ్యాపీ - ఎందుకంటే?
ఆమిర్ ఖాన్, అక్కినేని నాగచైతన్య నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమా వాయిదా పడింది. కారణం ఏదైనా సరే... ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడటం వల్ల 'కె.జి.యఫ్ 2', 'బీస్ట్' సినిమాలకు ప్లస్ కానుంది. ఎలా అంటారా?
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా... టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగచైతన్య ముఖ్య పాత్రలో రూపొందిన హిందీ సినిమా 'లాల్ సింగ్ చద్దా'. తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలని భావించారు. అయితే... సినిమా పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా (Laal Singh Chaddha Postponed) వేశారు. 'ఆదిపురుష్'ను వెనక్కి పంపించి మరీ... ఆగస్టు 11కు వెళ్లారు. 'ఆదిపురుష్' వాయిదా పడిందని ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అయితే... కన్నడ హీరో యష్, తమిళ స్టార్ విజయ్, హిందీ హీరో షాహిద్ కపూర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ. ఎందుకో తెలుసా? వాళ్ళ అభిమాన హీరోల సినిమాలకు ఎదురు లేకుండా పోయింది కాబట్టి!
యష్‌కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన సినిమా 'కె.జి.యఫ్'. దానికి సీక్వెల్‌గా రూపొందిన 'కె.జి.యఫ్ 2'ను ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన 'బీస్ట్' విడుదల కూడా అదే రోజున. ఈ రెండు సినిమాలను హిందీలోనూ విడుదల చేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' ఏప్రిల్ 14న వస్తే... ఈ రెండు సినిమాల కంటే ఆ సినిమాకు ఉత్తరాదిలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అక్కడి ప్రేక్షకులు ముందు ఆ సినిమాకు వెళ్ళాలని అనుకుంటారు. ఇప్పుడు ఆమిర్ సినిమా బరిలో లేకపోవడంతో 'కె.జి.యఫ్ 2', 'బీస్ట్' సినిమాలకు ప్లస్ అవుతుంది.
'లాల్ సింగ్ చద్దా', 'కె.జి.యఫ్ 2', 'బీస్ట్' ఒకే రోజు విడుదలైతే ఏ సినిమాకూ వెళతారని హిందీ మీడియా ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రశ్నిస్తూ కార్యక్రమాలు నిర్వహించారంటే హిందీలో సౌత్ సినిమాలకు ఏ స్థాయిలో ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. 'లాల్ సింగ్ చద్దా' వాయిదాతో ఇప్పుడు ఆ సమస్య లేదు.
Also Read: ఆమిర్ ఖాన్ కోసం ప్రభాస్ త్యాగం! 'ఆదిపురుష్' వాయిదా
షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'జెర్సీ' కూడా ఏప్రిల్ 14న (Jersey On 14 April 2022) విడుదల కానుంది. 'లాల్ సింగ్ చద్దా' వాయిదా పడటం వల్ల ఆ సినిమాకూ ప్లస్సే. తెలుగులో నాని హీరోగా నటించిన 'జెర్సీ'కి అది రీమేక్. తెలుగు సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి హిందీ సినిమాకూ దర్శకత్వం వహించారు. 'జెర్సీ' క్లాసికల్ ఎమోషనల్ సినిమా. 'కె.జి.యఫ్ 2', 'బీస్ట్' మాస్ కమర్షియల్ సినిమాలు కనుక వీటి మధ్య పోటీ తక్కువేనని చెప్పాలి.
Also Read: పవన్ 'భీమ్లా నాయక్' వెనక్కి - ఈ నాలుగు సినిమాలూ ముందుకు