X

KGF 2: యశ్‌కు క్షమాపణలు చెప్పిన అమీర్‌ఖాన్.. ‘కేజీఎఫ్ 2’కు ప్రచారం చేస్తానని వెల్లడి

‘కేజీఎఫ్ 2’ చిత్రయూనిట్‌కు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ క్షమాపణలు చెప్పడం చర్చనీయమైంది.

FOLLOW US: 

బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. విభిన్నమైన చిత్రాలతో ఆయన దక్షిణాది పరిశ్రమను కూడా ఆకట్టుకున్నారు. అయితే, ఇటీవల ఆయన కన్నడంలో తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్ 2’ మూవీ టీమ్‌కు క్షమాపణలు చెబుతూ ఆశ్చర్యానికి గురిచేశారు. చివరికి ఆ సినిమా హీరో యశ్‌‌‌కు కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు. 

అమీర్‌ఖాన్, నాగ చైతన్య, కరీనా కపూర్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా విడుదల తేదీని ఇటీవలే ప్రకటించారు. 2022, ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, అదే తేదీన యశ్ నటించిన ‘కేజీఎఫ్ 2’ సినిమా కూడా విడుదల కానుంది. ఈ విషయం తెలిసి అమీర్ ఖాన్.. ‘కేజీఎఫ్ 2’ చిత్ర యూనిట్‌కు క్షమాపణలు తెలియజేశారు. ఈ సందర్భంగా హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరంగదుర్‌లకు ఆయన లేఖ రాశారు. 

దీనిపై అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ను బైసఖి రోజున విడుదల చేయాలని అనుకున్నాం. అదే రోజు ‘కేజీఎఫ్ 2’ కూడా విడుదల అవుతుందని తెలిసింది. కానీ, మేము కావాలనే ఆ తేదీని ఎంచుకోలేదు. మా సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ముందే మేము యశ్‌తోపాటు నిర్మాత, దర్శకులకు పరిస్థితిని వివరిస్తూ లేఖ రాశా. లాక్‌డౌన్ వల్ల సినీరంగం ఎదుర్కొన్న సమస్యలు గురించి వివరించా. బైసఖి రోజున తమ సినిమా విడుదల తప్పనిసరి అని తెలిపాను. దీనికి ఆ చిత్ర యూనిట్ సానకూలంగా స్పందించింది. దీనిపై యశ్‌‌తో ఫోన్లో ప్రత్యేకంగా మాట్లాడాను’’ అని తెలిపారు. 

‘‘కేజీఎఫ్ 2 సినిమాకు ఉన్న లక్షలాది అభిమానుల్లో నేను కూడా ఒకడిని. ఆ సినిమాకు నేనే స్వయంగా ప్రచారం చేస్తాను. 14న థియేటర్‌కు వెళ్లి ఆ సినిమా చూస్తా. కేజీఎఫ్ 2, లాల్ సింగ్ చద్దా.. రెండూ వేర్వేరు జోనర్ చిత్రాలు. కాబట్టి.. ప్రేక్షకులు రెండు చిత్రాలను ఆదరిస్తారని భావిస్తున్నా’’ అని తెలిపారు. అయితే, ‘కేజీఎఫ్ 2’ ఈ చిత్రం విడుదల తేదీని మార్చే అవకాశాలు లేవు. ఎందుకంటే.. ఇప్పటికే ఈ చిత్రం విడుదల చాలా ఆలస్యమైంది. పైగా.. ఆ చిత్రానికి ఇప్పటికే మాంచి హైప్ క్రియేట్ కావడంతో నిర్మాతలు ధైర్యంగా ఉన్నారు. ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాను ఎప్పుడో ప్రకటించినా.. కరోనా, లాక్‌డౌన్‌ల వల్ల షూటింగ్ ఆలస్యమైంది. దీంతో ఎట్టిపరిస్థితుల్లో ప్రకటించిన తేదీనే విడుదల చేయాలనే నిర్ణయంలో అమీర్ ఖాన్ టీమ్ ఉంది. 

Also Read:బిగ్ బాస్ ట్విస్ట్.. ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్‌

Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మ‌ర‌ణించే వ‌ర‌కూ ఆ విష‌యం ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు - రాజ‌మౌళి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Aamir Khan Yash KGF 2 KGF 2 Release Aamir Khan Sorry To KGF 2 Laal Singh Chadda అమీర్ ఖాన్ కేజీఎఫ్ 2

సంబంధిత కథనాలు

Mammootty Covid: మాలీవుడ్ సూపర్ స్టార్ కి కరోనా పాజిటివ్..

Mammootty Covid: మాలీవుడ్ సూపర్ స్టార్ కి కరోనా పాజిటివ్..

Balakrishna: బీచ్ లో భార్యతో బాలయ్య ఫన్.. వీడియో వైరల్..

Balakrishna: బీచ్ లో భార్యతో బాలయ్య ఫన్.. వీడియో వైరల్..

Jayamma: 'జయమ్మ.. చూసే జనం కళ్లకి సూర్యకాంతమ్మ..' ర్యాప్ పాడిన సుమ..

Jayamma: 'జయమ్మ.. చూసే జనం కళ్లకి సూర్యకాంతమ్మ..' ర్యాప్ పాడిన సుమ..

NagaChaitanya: బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆమెతోనే.. సమంతపై చైతు కామెంట్స్..

NagaChaitanya: బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆమెతోనే.. సమంతపై చైతు కామెంట్స్..

Lata Mangeshkar Health: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. లేటెస్ట్ హెల్త్ అప్డేట్..

Lata Mangeshkar Health: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. లేటెస్ట్ హెల్త్ అప్డేట్..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Hug: కౌగిలించుకుంటే ఇన్ని ప్రయోజనాలా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు.. ఇక చెలరేగిపోతారు

Hug: కౌగిలించుకుంటే ఇన్ని ప్రయోజనాలా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు.. ఇక చెలరేగిపోతారు

Goa Elections 2022: గోవా ఎన్నికల బరిలో శివసేన, ఎన్‌సీపీ ఉమ్మడి పోరు.. సింగిల్‌గా కాంగ్రెస్ పోటీ

Goa Elections 2022: గోవా ఎన్నికల బరిలో శివసేన, ఎన్‌సీపీ ఉమ్మడి పోరు.. సింగిల్‌గా కాంగ్రెస్ పోటీ

Crime News: హైదరాబాద్‌‌లో బ్యూటీషియన్ దారుణహత్య.. ప్రియుడితో సహజీవనం, ఆపై ఫ్లాట్‌లో శవమై కనిపించిన యువతి

Crime News: హైదరాబాద్‌‌లో బ్యూటీషియన్ దారుణహత్య.. ప్రియుడితో సహజీవనం, ఆపై ఫ్లాట్‌లో శవమై కనిపించిన యువతి

Samantha Photos: సమంత క్యూట్ స్మైల్.. అభిమానులు ఫిదా..

Samantha Photos: సమంత క్యూట్ స్మైల్.. అభిమానులు ఫిదా..