అన్వేషించండి

Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా 'శంబాల' - టైటిల్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేసిన ఆది!

నటుడు ఆది సాయి కుమార్ మరో క్రేజీ మూవీ అనౌన్స్ చేశారు. ‘శంబాల’ అనే సూపర్ నేచురల్ థ్రిల్లర్ లో నటించబోతున్నారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ క్రేజీగా ఆకట్టుకుంటున్నది.

Shambala Movie First Look: ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, క్రేజీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు యంగ్ హీరో ఆది సాయి కుమార్. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలకు పూర్తి భిన్నమైన మరో సినిమాను అనౌన్స్ చేశారు. ఆది, ఆనంది హీరో, హీరోయిన్లుగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘శంబాల’ అని పేరు పెట్టారు. యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

టైటిల్ పోస్టర్ తోనే పెరిగిన అంచనాలు

ఆది కొత్త సినిమా 'శంబాల' సరికొత్త కథాంశంతో తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌ మెంట్ పోస్టర్‌ ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. చూడటానికే చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఒక్క మనిషి లేని గ్రామం, సైకిల్ మీద తీసుకెళ్తున్న పాల క్యాన్ కిందపడి ఒలికిపోతున్నట్లు, ఆ పాల్లలో రక్తం కసినట్లు, వాటిని ఓ కుక్క తాగుతున్నట్లు భయంకరంగా చూపించారు. మేఘాలు గర్జిస్తున్న ఆకాశం, భయంకరమైన రాక్షస మేఘ రూపం, ఉరుములు మెరుపులతో పెను ప్రళయానికి ముందుకు భీకర పరిస్థితి కనిపిస్తోంది. ఈ పోస్టర్ సినిమాపై ప్రేక్షకులను ఓ రేంజిలో క్యూరియాసిటీ పెంచుతోంది. ‘శంబాల’ కథలో వణుకు పుట్టించే థ్రిల్లింగ్ అంశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

జియో సైంటిస్ట్ గా ఆది సాయి కుమార్

ఈ సినిమాలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్టుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పవర్ ఫుల్, ఛాలెంజింగ్ రోల్ ను ఆయన పోషించబోతున్నారు. ఈ సినిమాలో ఆది సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో సత్తా చాటుతున్న అమ్మాయి ఇందులో ఫీమేల్ లీడ్ చేస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   

డిఫరెంట్ స్టోరీ లైన్‌ తో తెరకెక్కనున్న 'శంబాల'

ఇప్పటికే  'ఏ' యాడ్ ఇన్‌ఫినిటిమ్ అనే డిఫరెంట్ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న యుగంధర్ ముని ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తొలి ఫస్ట్ మూవీ మాదిరిగానే ‘శంబాల’ను కూడా డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కించబోతున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని అంశంతో తెరకెక్కనున్నట్లు ఆయన తెలిపారు. 

హాలీవుడ్ స్టాయిలో చిత్ర నిర్మాణం

అమెరికాలోని న్యూయార్క్‌ ఫిలిం అకాడమీలో ఫిలిం మేకింగ్‌ కోర్సు చేసిన యుగంధర్‌.. 'శంబాల' సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలని భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రాజశేఖర్‌ అన్నభీమోజు , మహిధర్ రెడ్డి నిర్మాతలుగా కొనసాగుతున్నారు. శ్రీరామ్‌ మద్దూరి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరోవైను సాయి ఆది కుమార్ త్వరలో ‘షణ్ముఖ’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Read Also: ‘మున్నాభాయ్ 3’పై రాజ్‌కుమార్ క్రేజీ అప్ డేట్, సంజూ భాయ్ ఫ్యాన్స్ కు పండగే పండుగ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget