1134 Movie Trailer: ఏటీఎం రాబరీ కాన్సెప్ట్ తో '1134', ఇదిగో ట్రైలర్
డిఫరెంట్ కాన్సెప్ట్ తో'1134' అనే సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించబోతుంది.
ఈ మధ్యకాలంలో వచ్చిన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా వరకు భారీ విజయాలను అందుకున్నాయి. స్టార్లు లేకపోయినా.. కథ, కథనాలతో ఆకట్టుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఆడియన్స్ కూడా ఈ తరహా సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే '1134' అనే సినిమా తెరకెక్కింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించబోతుంది. దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఏటీఎం రాబరీ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. వరుస ఏటీఎం దొంగతనాలతో సిటీ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుంటుంది ఓ గ్యాంగ్. 'ఒకరికి మరొకరు తెలియదు.. అలా ఓ ముగ్గురు ఉన్నారు.. వాళ్లు కొన్ని దొంగతనాలు చేశారు' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.
ట్రైలర్ లో డైలాగ్స్ ఒకట్రెండు మాత్రమే వినిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. ట్రైలర్ అయితే సో సో గా ఉంది మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. రాంధుని క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాను తెరకెక్కిస్తున్నారు. గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, మదుపు ఫణి భార్గవ్, కృష్ణ మదుపు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివతేజ్ బైపల్లి, శరత్ కూతాడి సంగీతం అందిస్తున్నారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుందని చెబుతున్నారు దర్శకనిర్మాతలు.
Here's the gripping trailer of #1134Film.
— Ssharadh chandra Tadimeti (@Ssharadhchandra) February 18, 2022
▶️ https://t.co/mXZ84c4I1q
🎬 :@Ssharadhchandra
💰 :#RamdhuniCreations
🌟ing :#Gangadhar #bhargav #Phani #krishna
🎼 : #Sharath #shivtej
📽️:#Najeeb #jithender
📣 :@TheSaiSatish @ParvathaneniRam
Here's the Poster Of my debut directional film #1134film 🥷🏻💸
— Ssharadh chandra Tadimeti (@Ssharadhchandra) February 16, 2022
A suspence thriller based on ATM robberies !
🎬 :@Ssharadhchandra
💰 :#RamdhuniCreations
🌟ing :#Gangadhar #bhargav #Phani #krishna
🎼 : #Sharath #shivtej
📽️:#Najeeb #jithender
📣 :@TheSaiSatish @ParvathaneniRam pic.twitter.com/zZCJ38IQmF