YSRCP Comments On Pawan: పల్లకీ మోయడమే తప్ప పావలా వంతు కూడా దక్కలేదా- పవన్‌పై వైసీపీ సెటైర్లు
YSRCP Comments On Pawan: అసెంబ్లీ ఎన్నికల్లో తొలి జాబితా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను వైసీపీ టార్గెట్ చేసుకుంది. కేవలం 24 సీట్లకు పరిమితం కావడంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
![YSRCP Comments On Pawan: పల్లకీ మోయడమే తప్ప పావలా వంతు కూడా దక్కలేదా- పవన్‌పై వైసీపీ సెటైర్లు YCP leaders are criticizing Pawan for settling with 24 seats in the assembly elections 2024 YSRCP Comments On Pawan: పల్లకీ మోయడమే తప్ప పావలా వంతు కూడా దక్కలేదా- పవన్‌పై వైసీపీ సెటైర్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/28b0a7d87c4f29dadb94512aea4c882c1708762461577215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YSRCP Comments On Pawan: జనసేన అధ్యక్షుడు అనే దాని కంటే ఆ పార్టీని టీడీపీలో విలీనం చేసి టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుందని పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. చంద్రబాబు ఇచ్చిన 24 సీట్లు తీసుకొని ఎవరి పై ఏం యుద్ధం చేస్తారని ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన సజ్జల చంద్రబాబు, పవన్‌పై విమర్శలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల పొత్తుల్లో భాగంగా జనసేన 24 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయంచడంపై అధికార పక్షం నుంచి గట్టిగానే కౌంటర్‌లు వస్తున్నాయి. కనీసం పావలాకి కూడా పనికి రాడని తేల్చిన టీడీపీ 24 సీట్లు మాత్రమే ఇచ్చిందని సెటైర్లు పేల్చారు అంబటి రాంబాబు. ఛీ... పవన్ అంటూ ట్వీ చేస్తూ పల్లకి మోయడమే తప్ప పావలాకి కూడా పనికి రావాలని చంద్రబాబు తేల్చారంటూ విమర్శలు చేశారు.
పల్లకి మోయడానికి తప్ప
— Ambati Rambabu (@AmbatiRambabu) February 24, 2024
పావలా వంతుకు కూడా
పనికిరావని తేల్చేసారు.... ఛీ @PawanKalyan
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)