Guntakallu assembly : గుంతకల్లులో గెలిచే పార్టీదే అధికారం - ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు ?
AP Elections 2024 : గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారమన్న సెంటిమెంట్ ఉంది. ఈ సారి ఎవరు గెలుస్తారు ?
Guntakallu assembly Sentiment Elections : ఎన్నికలవేళ కొన్ని సెంటిమెంట్లు నేతలు నమ్ముతూ వస్తుంటారు. ఆ సెంటిమెంట్లు నిజమౌతూ వస్తూ ఉంటే వాటిని స్థానికంగా ఉన్న నేతలలేకాకుండా పార్టీ అధినేతలు కూడా బలంగా విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి సెంటిమెంట్ గా ఉన్న నియోజకవర్గమే గుంతకల్లు. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు నియోజకవర్గం వర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. గుంతకల్లు నియోజకవర్గం లో ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుపొందుతాడో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తుంటారు.
టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా గుంతకల్లులో గెలుపు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గుంతకల్లులో గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తోంది. దీంతో ప్రతి ఎన్నికల్లో జిల్లా వాసులు దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంటుంది. ఇక్కడ ఆయా పార్టీల తరపున నిలబడిన అభ్యర్థుల బలాబలాలను కూడా బెరీజు వేసుకుంటూ ఉంటారు పార్టీ అధినేతలు. దీంతో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో అని అంచనా వేసి రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని భావనలో నేతలు ఉంటారు.
నాటి నుంచి నేటి వరకు అక్కడ గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల పార్టీ లదే అధికారం
గుంతకల్లు నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఇది పునర్విభజనకు ముందు గుత్తి నియోజక వర్గంగా ఉండేది. ఇక్కడ కూడా అదే సెంటిమెంట్ ఉంది. గుత్తిలో 1983లో పి రాజగోపాల్ టిడిపి తరఫున పోటీ చేసే గెలవగా అప్పుడు టిడిపి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టింది. 1985లో గాది లింగప్ప టిడిపి నుంచి పోటీ చేసి గెలుపొందగా అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1989లో హరికేరి జగదీష్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలవగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. 1994లో గాదలింగప్ప 1999లో ఆర్ సాయినాథ్ గౌడ్ టిడిపి తరఫున పోటీ చేసి గెలవగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. 2004లో ఎస్ లీలావతి 2009లో గుంతకల్లు ఏర్పడిన తర్వాత మధుసూదన్ గుప్తా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలవగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో జితేంద్ర గౌడ్ టిడిపి నుంచి పోటీ చేసి గెలవగా టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వై వెంకట్రామిరెడ్డి పోటీ చేసి గెలవగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఈ ఎన్నికల్లో హోరాహోరీ
ఇప్పటికే కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగారు. గుమ్మనూరు జయరాం వైసిపిని వీడి టీడీపీలో చేరిన అనంతరం గుంతకల్లు కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి మరోసారి వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే తమ పార్టీని రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి తెస్తాయని వైసీపీ నేతలు భావిస్తుంటే.. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన వైసిపి ప్రభుత్వానికి చమర గీతం పాడాలని టిడిపి గెట్టి పట్టుదలతో ఉంది. దీంతో అంగ బలం, ఆర్థిక బలం ఉన్న ఇద్దరు నేతలు గుంతకల్లు నియోజకవర్గం లో పోటీ చేస్తున్నడంతో పోటీ రసవత్వంగా మారింది. గుంతకల్లు నియోజకవర్గం లో ఎవరు జెండా ఎగరవేస్తారనేది మరి కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.