Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Hyderabad PollQRoute: హైదరాబాద్వంటి నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోందని గమనించి ఈసీ చర్యలు తీసుకుంది. PollQRoute ద్వారా అప్ డేట్స్ తెలుసుకుని ఓటర్లు టైం వేస్ట్ కాకుండా ఓటు వేయవచ్చు.
Telangana Elections 2023: ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎలక్షన్ అధికారులు ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో తక్కువ ఓటింగ్ జరుగుతోందని తెలిసిందే. పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లు ఎక్కువగా ఉండటం, సదుపాయాలు సరిగా లేకపోవడంతో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని గుర్తించారు. దాంతో హైదరాబాద్ లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. PollQRoute ద్వారా అప్ డేట్స్ తెలుసుకుని ఓటర్లు చకచకా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి టైం వేస్ట్ కాకుండా ఓటు వేసి వెళ్లిపోవచ్చు అని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ (Telangana CEO Vikas Raj) తెలిపారు.
హైదరాబాద్వంటి నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోందని గమనించి ఈసీ చర్యలు తీసుకుంది. ఓవైపు పోలింగ్ స్టేషన్ల వద్ద టాయిలెట్లు, నీటి సౌకర్యం, షాడో నెట్స్ వంటి సదుపాయాలను కల్పించారు. మరోవైపు యాప్ ద్వారా ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్ వివరాలు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు వికాస్ రాజ్ చెప్పారు. యాప్తో పాటు వెబ్ సైట్ ( https://ghmcbls.in/poll-queue-status ) లోనూ వివరాలు పొందుపరిచారు. పోల్ క్యూ స్టేటస్ పేజీలో మొదట మీ నియోజకవర్గాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఆపై పోలింగ్ స్టేషన్ సెలక్ట్ చేస్తే క్యూ లైన్లో ఓటు వేయడానికి ఎంత మంది ఉన్నారు, ఓటు వేయాలంటే ఎంత సమయం పడుతుందో సైతం తెలుసుకోవచ్చు. దాంతోపాటు పోలింగ్ కేంద్రానికి ఎలా వెళ్లారో డైరెక్షన్ కూడా చూసుకునే అవకాశం కల్పించారు. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి ఈ సదుపాయాలు సద్వినియోగం చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈసీ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. దివ్యాంగుల కోసం, వృద్ధుల కోసం వారు కోరితే ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాల వరకు రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాల్లో వీల్ఛైర్స్ ఏర్పాటు చేశారు. వీరికి సాయం చేసేందుకు వాలంటీర్లను కూడా పెట్టినట్లు వికాస్ రాజ్ తెలిపారు. అంధుల కోసం బ్రెయిల్ లిపిలో పోస్టల్ బ్యాలెట్, పోస్టర్స్ అందుబాటులో ఉంచారు. వినికిడి లోపం ఉన్న వారితో మాట్లాడే విధంగా పోలింగ్అధికారులకు శిక్షణ ఇచ్చారు.
ఎస్‌ఎంఎస్ ద్వారా క్యూలైన్ అప్ డేట్స్..!
గ్రేటర్ హైదరాబాద్ లో ప్రత్యేక యాప్ ద్వారా ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ వివరాలు ఎస్ఎంఎస్ పంపించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ప్రత్యేక యాప్ ట్రయల్ సక్సెస్ అయితే హైదరాబాద్ లో ఓటర్ల మొబైల్ కు క్యూ లైన్ వివరాలు పంపనున్నారు. ఒకవేళ యాప్ నుంచి నగర ఓటర్లకు వివరాలు రాకపోయినా, https://ghmcbls.in/poll-queue-status వెబ్ సైట్ లో క్యూ లైన్ లో ఎంత మంది ఉన్నారు, ఓటు వేయడానికి ఎంత టైమ్ పడుతుంది తెలుసుకోవచ్చు.
Also Read: Voting Procedure: ఇలా చేస్తే మీరు ఓటు వేసినా నో యూజ్! - పర్ఫెక్ట్ ఓటింగ్‌కి ఈ సూచనలు పాటించండి
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply