అన్వేషించండి

Voting Procedure: ఇలా చేస్తే మీరు ఓటు వేసినా నో యూజ్‌! - పర్ఫెక్ట్ ఓటింగ్‌కి ఈ సూచనలు పాటించండి

ఓటర్ స్లిప్స్ రానివాళ్లు బీఎల్వోను సంప్రదించాలి. ఆన్‌లైన్‌లో కూడా పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు.

నవంబరు 30 ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే ఓటరు స్లిప్‌లను పంపిణీ దాదాపు పూర్తి చేశారు. ఈ స్లిప్‌లపై ఎలాంటి పార్టీ గుర్తులు, ఇతర సింబల్స్ ఉండటానికి వీల్లేదని అధికారులు చెబుతున్నారు. అలాంటివి ఉంటే మాత్రం పోలింగ్ కేంద్రంలోకి రానివ్వబోమని హెచ్చరిస్తున్నారు. వీటిని గుర్తింపు కార్డులుగా చూడబోమని.. ప్రత్యేక గుర్తింపు కార్డులు కూడా తమతో తీసుకురావాలని అధికారులు సూచించారు. 

ప్రభుత్వం జారీ చేసిన ఓటర్‌ ఐడీ చూపించవచ్చు. దాన్ని చూపిస్తే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటర్ స్లిప్స్ రానివాళ్లు బీఎల్వోను సంప్రదిస్తే చాలన్నారు. ఆన్‌లైన్‌లో కూడా పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు.

ఈ గుర్తింపు కార్డుల్లో ఏదైనా తీసుకొని వెళ్లొచ్చు.

  • ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్‌)
  • ఆధార్‌ కార్డు
  • పాసుపోర్టు      
  • డ్రైవింగ్‌ లైసెన్సు
  • కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్‌ సెక్టార్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు
  • బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం (ఫొటోతో ఉన్నవి)
  • పాన్‌కార్డు
  • జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్‌కార్డు
  • ఎంఎన్‌ఆర్‌జీఏ జారీ చేసిన జాబ్‌కార్డు
  • కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు
  • ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు
  • ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం.

ఓటు వేసే టైంలో చేసే చిన్న తప్పులు కారణంగా ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి సెల్‌ఫోన్‌తో రావద్దని వస్తే చర్యలు ఉంటాయని అంటున్నారు. ఓటు వేసే టైంలో సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోలు దిగడం కూడా నేరమని అధికారులు చెబుతున్నారు. అలాంటి వారు శిక్షార్హులని వార్నింగ్ ఇస్తున్నారు. అలాంటి పని చేసిన ఓటర్‌ ఓటును 17-ఏలో నమోదు చేస్తారు. కౌంటింగ్ టైంలో ఆ ఓటును లెక్కలోకి తీసుకోరు. దివ్యాంగులకు సహాయం చేసిన వారు కూడా ఎవరికి ఓటు వేశారో బయటకి చెప్పకూడదు. 

మీ ఓటు వేరే వాళ్లు వేసి ఉంటే ఏం చేయాలి?
చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇది మనం చూస్తుంటాం. ఒకరికి బదులు మరొకరు ఓటు హక్కు వినియోగించుకొని ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలో చట్టంలో స్పష్టంగా ఉంది. సెక్షన్ 49 (పి) ప్రకారం ఎవరైనా మన ఓటు వేసి ఉంటే మళ్లీ పొందవచ్చు. 1961లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ముందుగా ఆ పేరు గల వ్యక్తివి నువ్వే అనే ఐడీ ప్రూఫ్‌లను ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. ఆయన నిజంగానే మీ ఓటు వేరే వాళ్లు వేసేశారు అని నమ్మితే ప్రక్రియ ప్రారంభిస్తారు. 

ప్రిసైడింగ్ అధికారి ఫామ్ 17 (బి) ఇస్తారు. అందులో పేరు, సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తైతే టెండర్డ్ బ్యాలెట్ పేపర్‌ ఇస్తారు. అందులో మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి తిరిగి అధికారులకు ఇచ్చేయాల్సి ఉంటుంది. అధికారులు సూచించినట్టుగానే ఓటు వేయాల్సి ఉంటుంది. ఈవీఎం ద్వారా వేస్తామంటే మాత్రం వీలుపడదు. పోస్టల్ బ్యాలెట్‌ ద్వారానే ఓటు వేయాల్సి ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget