అన్వేషించండి

Telangana Elections 2023: బీజేపీ, జనసేన పొత్తు టీడీపీ ఓట్ల కోసమేనా ? సీట్లు కేటాయించింది కూడా ఆ స్థానాల్లోనేనా!

Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ప్రచారం ఊపందుకుంది. పార్టీలు విరామం లేకుండా ప్రచారం చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి.

Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ప్రచారం ఊపందుకుంది. పార్టీలు విరామం లేకుండా ప్రచారం చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి గులాబీ పార్టీ పావులు కదుపుతుంటే... కారుకు బ్రేకులు వేయాలని హస్తం పార్టీ ఎత్తులు వేస్తోంది. తెలంగాణ విజయం సాధించి..దక్షిణాదిన కాషాయ జెండాను రెపరెపలాండించాలని బీజేపీ పైఎత్తులు వేస్తోంది. కమలం పార్టీ, జనసేన పొత్తుపై తెలంగాణలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జస్ట్ ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. హిందూత్వవాది రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో దుబ్బాకలో రఘునందన్ రావు, హుజురాబాద్ లో ఈటల రాజేందర్ విజయం సాధించారు. దీంతో బీజేపీ బలం మూడుకు చేరుకుంది.

జనసేనకు 9 సీట్లు కేటాయింపు
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కలిసి వస్తుందని భావించినా అది జరగలేదు. శాసనసభ ఎన్నికల్లో జనసేనకు తొమ్మిది సీట్లను కేటాయించింది. మొదట జనసేన 11 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించింది. ఇరు పార్టీల నేతల చర్చల 9 స్థానాలకు అంగీకారం కుదిరింది. కూకట్‌పల్లితోపాటు మరో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర, వైరా, నాగర్‌కర్నూల్‌, కోదాడ, కూకట్‌పల్లి స్థానాలు కేటాయించినట్టు సమాచారం. శేరిలింగంపల్లి స్థానంపై ఇంకా పీటముడి వీడలేదు. శేరిలింగంపల్లి కోసం జనసేన పట్టుబడుతోంది. బీజేపీలోనూ శేరిలింగంపల్లి స్థానంపై తీవ్ర పోటీ నెలకొంది. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన తర్వాత శేరిలింగంపల్లి సీటుపై క్లారిటీ వచ్చే అవకాశముంది. 

టీడీపీ ఓట్ల కోసం బీజేపీ, జనసేన పొత్తు
బీజేపీ, జనసేన పొత్తుపై తెలంగాణలో జోరుగా చర్చ సాగుతోంది. 2018లో రెండు సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంది. దీనిపై అనేక రకాలుగా విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల రీత్యా సైలెంట్ అయింది. పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోయినా, ప్రతి జిల్లాలో, నియోజకవర్గాల్లో ఇప్పటికి చెక్కుచెదరని ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్ ను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ, జనసేన కలిసి బరిలోకి దిగాయి. తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటు ఈ కూటమి వైపు మళ్లితే మెజార్టీ సీట్లు సాధించవచ్చన్న ధీమాలో బీజేపీ, జనసేన నేతలు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో సీమాంధ్ర ఓటర్లు భారీగా ఉన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో టీడీపీకి ఓటర్లు ఉన్నారు. ఇవన్నీ సాలిడ్ గా కూటమికి పడతాయన్న లక్ష్యంతోనే పొత్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

మంగళవారం హైదరాబాద్ కు మోడీ
119 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 88 చోట్ల అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మిగిలిన 31 స్థానాలకు 9 చోట్ల జనసేన బరిలోకి దిగనుంది. 22 స్థానాలకు కాషాయ పార్టీ అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటించనుంది. ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమష్టిగా పని చేయాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు. ప్రధాని మోడీ మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో పాల్గొనే బీసీ ఆత్మగౌరవ సభకు పవన్‌కల్యాణ్‌ హాజరు కానున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Embed widget