News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

కార్తీక వన భోజనాల్లో అభ్యర్థుల ప్రచారం, నగర శివార్లలో ఫామ్ హౌస్ లు బుక్

అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీల అభ్యర్థులు వన సమారాధన పేరిట ఇప్పటికే కొన్ని ఫామ్ హౌస్‌లను బుక్ చేసుకుంటున్నాయి. అక్కడ కులాల వారీగా సమావేశాలు పెట్టి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

FOLLOW US: 
Share:

Telangana Assembly Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు కార్తీకమాసం కావడంతో వన సమారాధన (Vana Samaradhana) కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తెలంగాణ ఎన్నికల వేళ కార్తీక మాసం అభ్యర్దులకు కలిసివస్తోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ( Candidates) వన సమారాధన పేరుతో కులాల వారీగా భోజనాలను ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో తిరగకుండానే ఓటర్లందర్ని ఒకే చోట కలిసే అవకాశం రావడంతో కార్తీక మాసాన్ని ఉపయోగించుకుంటున్నారు. నగర శివార్లలో కులాల వారీగా వనభోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ కంటే భిన్నంగా ప్రజలను ఆకట్టుకునేందుకు...ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కుల సంఘాలు, మహిళా సంఘాలు, యూత్ అసోసియేషన్లకు పార్టీలు పెద్ద పీట వేస్తన్నాయి. కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. సాధారణంగా స్నేహితులు, బంధువులు కలసి వనభోజనాలకు వెళ్లి వస్తుంటారు. కార్తీక మాసంలో అందరూ కలుసుకుని తమ కుటుంబ సమస్యలను చెప్పుకోవడానికి వీటిని వేదికలుగా ఉపయోగించుకుంటారు. ఎక్కువ మంది ఈ వనభోజనాలతో ఆత్మీయ కలయికలుగా వాడుకుంటారు. 

నగర శివార్లలో ఫామ్ హౌస్ రిజర్వ్
అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీల అభ్యర్థులు వన సమారాధన పేరిట ఇప్పటికే కొన్ని ఫామ్ హౌస్‌లను బుక్ చేసుకుంటున్నాయి. అక్కడ కులాల వారీగా సమావేశాలు పెట్టి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అభ్యర్థుల వ్యయం కూడా ఇందులోకి రాదు. సామూహిక సమావేశాలు కావడం, సంప్రదాయం కావడంతో ఎన్నికల లెక్కల నుంచి తప్పించుకోవచ్చు. మంచి భోజనంతో పాటు అన్ని రకాల వస్తువులు బహుమతులుగా ఇచ్చేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. నగర శివార్లలో ఉన్న రిసార్ట్స్ ను కొందరు రాజకీయ నేతలు ముందుగానే బుక్ చేసుకున్నట్లు సమాచారం. వారి పేరు మీద కాకుండా తమ ముఖ్య అనుచరుల పేర్లపై ఈ రిసార్ట్‌లను బుక్ చేసుకున్నారు. వచ్చిన వారందరికీ నాన్ వెజ్, వెజ్ తో రుచికరమైన భోజనాలు అందించేందుకు క్యాటరింగ్ ఏర్పాట్లు చేశారు. సామాజికవర్గం ఓట్లను తమకు అనుకూలంగా రాబట్టు కోవడం కోసం అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

కార్తీక వన భోజనాలపై కెమెరాల కన్ను ఉండదు
అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నియోజకవర్గం పరిధిలో ఈ వన భోజనాల ఏర్పాట్లకు రెడీ చేసుకుంటున్నారు. కులాల వారీగా వనభోజనాలు ఏర్పాటు చేసి...అందరినీ తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుల సమావేశాలు, కార్తీక వన భోజనాలపై కెమెరాల కన్ను ఉండదు. గుట్టు చప్పుడు కాకుండా ఖర్చు తమ నెత్తిన పడకుండా చేసే వీలుంటుంది. పైగా అందరూ ఒకచోట చేరితే తాము తిరగకుండా ప్రచారం చేసుకునే వీలుంటుందని అభ్యర్థులు కార్తీక వన సమారాధాన భోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం సామాజికవర్గాల వారీగా మాత్రమే కాకుండా కాలనీల వారీగా కూడా ఈ వనభోజనాలను ఏర్పాట్లు చేశారు. ఎక్కువ మంది నాన్ వెజ్ తినకపోవడం కూడా తమకు ఖర్చు రూపంలో కలసి వస్తుందని అంటున్నారు. కొందరు నేరుగా రిసార్ట్‌ యజమానులతో మాట్లాడి పనులు కానిచ్చేస్తున్నారు. అభ్యర్థి వచ్చినా రాకున్నా అనుచరులు ఓట్లు తాము బలపరిచినవారికి పడేలా సూచిస్తున్నారు. శని, ఆదివారాల్లోనే ఎక్కువగా శివార్లలో రిసార్ట్స్ బుక్కవుతున్నాయి. అయితే ఈసారి వీక్ డేస్‌లో కూడా తీసుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. 

Published at : 20 Nov 2023 05:30 PM (IST) Tags: Elections 2023 Telangana Assembly Election 2023 Telangana Election 2023 Telangana Election Kartika Vana Bhojanams

ఇవి కూడా చూడండి

Komatireddy Wishes Revanth: సీఎంగా రేవంత్​రెడ్డి ఎంపిక, హర్షం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Wishes Revanth: సీఎంగా రేవంత్​రెడ్డి ఎంపిక, హర్షం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి, డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం- కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన

Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి, డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం- కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana Polls: తెలంగాణ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు, ఫోటోలతో ప్రచారాలు - అన్ని పార్టీలదీ అదే దారి !

Telangana Polls: తెలంగాణ ఎన్నికల్లో ఫేక్ వీడియోలు, ఫోటోలతో ప్రచారాలు  - అన్ని పార్టీలదీ అదే దారి !

టాప్ స్టోరీస్

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?

Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో -  ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?

Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు

Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు
×