అన్వేషించండి

నాటి కార్పొరేటర్లే నేటి ఎమ్మెల్యే అభ్యర్థులు

కార్పొరేటర్‌గా రాజకీయాలు మొదలుపెట్టి రాష్ట్ర రాజకీయాలను శాసించేలా మంత్రులుగానూ ఎదిగారు. కార్పొరేటర్లుగా రాజకీయాలు ప్రారంభించిన పలువురు నేతలు, ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Telangana Assembly Elections: కార్పొరేటర్‌గా రాజకీయాలు మొదలుపెట్టి అసెంబ్లీలో అధ్యక్షా అన్నారు. రాష్ట్ర రాజకీయాలను శాసించేలా మంత్రులు(Ministers)గానూ ఎదిగారు. కార్పొరేటర్లుగా రాజకీయాలు ప్రారంభించిన పలువురు నేతలు, ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అలాంటి వారికి పార్టీలు పిలిచి టికెట్‌ కేటాయించాయి. బీఆర్‌ఎస్‌(Brs), కాంగ్రెస్‌(Congress), బీజేపీ(Bjp), ఎంఐఎం(Mim) పార్టీల్లో అలాంటి నేతలు చాలా మంది ఉన్నారు. మజ్లిస్ పార్టీ ఆరుగురు కార్పొరేటర్లకు టిక్కెట్‌ ఇచ్చింది. హస్తం పార్టీ ఇద్దరు సిట్టింగ్ కార్పొరేటర్లకు, కమలం పార్టీ ఒక కార్పొరేటర్‌కు అసెంబ్లీ టికెట్‌ కేటాయించింది. పేరుకు కార్పొరేటరైనా నియోజకవర్గంలో చక్రం తిప్పుతారన్న అంచనాలతో పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. పార్టీ అండదండలతో ఎమ్మెల్యేగా ఎన్నికవుతారన్న నమ్మకం పార్టీలకు ఉంది. అందుకే ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్‌లు తమ కార్పొరేటర్లను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించాయి. 

పతంగ్ పార్టీ అన్ని పార్టీల కంటే టాప్ ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కార్పొరేటర్లకి ప్రాధాన్యం ఇచ్చింది. షేక్‌పేట్ కార్పొరేటర్ మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్‌ను జూబ్లీహిల్స్ నుంచి, లంగర్ హౌస్ మాజీ కార్పొరేటర్ రవి యాదవ్‌ను రాజేంద్రనగర్ నుంచి ఎంఐఎం పోటీకి దించింది. 20ఏళ్లుగా శాస్త్రిపురం కార్పొరేటర్ పని చేస్తున్న మహ్మద్ ముజీన్‌...బహదుర్‌పుర నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  మాజీ కార్పొరేటర్  జాఫర్ హుస్సేన్‌కు గతంలో నాంపల్లి నుంచి బరిలోకి దించింది. తాజాగా యాకత్ పుర టికెట్‌ను కేటాయించింది. మేయర్‌గా పని చేసిన జుల్ఫికర్ అలీని, ఈ ఎన్నికల్లో చార్మినార్ నుంచి పోటీకి నిలబెట్టింది. మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్‌ను నాంపల్లి అభ్యర్థిగా బరిలోకి దింపింది ఎంఐఎం. గతంలో పత్థర్‌గట్టి కార్పొరేటర్‌గా పని చేసిన అబ్దుల్లా బలాలా  2009 నుంచి మలక్‌పేట్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా ఆయన ఎంఐఎం తరపున బరిలోకి దిగారు. కార్వాన్‌ నుంచి బరిలోకి దిగిన కౌసర్ మొహియుద్దీన్ కూడా గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. 

హైదరాబాద్‌లో మాస్‌ లీడర్లు పేరు సంపాదించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, పద్మారావు గౌడ్‌ కూడా ఇద్దరు కార్పొరేటర్లుగా రాజకీయాలను ప్రారంభించారు. 1986లో జరిగిన హైదరాబాద్‌ మున్సిపల్ ఎన్నికల్లో మోండా మార్కెట్‌ నుంచి ఇద్దరు తలపడ్డారు. ఆ ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పై పద్మారావు గౌడ్ విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. 1994, 1999లో వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగానూ పని చేశారు. ఆ తర్వాత 2004లో సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్‌ తరపున పోటీ చేసిన పద్మారావు గౌడ్‌, తలసానిపై మరోసారి ఎమ్మెల్యేగాను గెలుపొందారు. ఒకసారి మంత్రిగా, ఇంకోసారి డిప్యూటీ స్పీకర్‌గానూ పని చేశారు. ప్రస్తుతం తలసాని శ్రీనివాస్‌ యాదవ్, పద్మారావు గౌడ్‌ ఇద్దరు గులాబీ పార్టీలో ఉన్నారు. 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కార్పొరేటర్లుగా పని చేసి అసెంబ్లీలో అడుగు పెట్టిన వారిలో బీఆర్ఎస్  నేతలు కూడా ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌  ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి గులాబీ పార్టీ నుంచి బరిలోకి దిగారు. అంతకుముందు కాలేరు వెంకటేశ్‌ అంబర్‌పేట కార్పొరేటర్‌గా పని చేశారు. రాజేంద్రనగర్‌లో బీజేపీ అభ్యర్థిగా తోకల శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్‌గా బీజేపీ తరపున గెలుపొందారు. ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న విజయారెడ్డి ప్రస్తుతం కార్పొరేటర్. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జి. జగదీశ్వర్ గౌడ్ ఇప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Rapido Data Leak: యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Embed widget