అన్వేషించండి

Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు...పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు...ఏమన్నారంటే...

 Telangana Assembly Election 2023: డిసెంబరు 3 ఫలితాల్లో BRS విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్. 70 సీట్లకు తగ్గకుండా గెలుస్తాం అని.. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు అన్నారు.  2018 ఎగ్జిట్‌ పోల్స్‌లో ఒక్క సంస్థ మాత్రమే సరిగా చెప్పిందన్న కేటీఆర్  ఈ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు.  మళ్లీ అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

Also Read: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

కేటీఆర్ మాటల్లోనే..

తెలంగాణలో ఎన్నికలు ముగియగానే పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని వచ్చింది. తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ను మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. ఇంకా ఓటింగ్ పూర్తికాలేదు, ఓటింగ్ ఎంత శాతం జరిగిందనేది తేలలేదు. కానీ కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అని దుష్ప్రచారం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. 2018లో ఒక్క ఏజెన్సీ మాత్రమే సరైన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ ఎన్నికల్లో విజేత ఎవరనేది డిసెంబర్ 3వ తేదీన తేలుతుందన్నారు. గత మూడు నెలలుగా పార్టీ గెలుపు కోసం కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Also Read: ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 48 సీట్లు వస్తాయని ఒకరు, 50 సీట్లకు పరిమితమని మరో సంస్థ చెప్పిందన్నారు. కానీ 2018లో తాము 88 సీట్లతో ఘన విజయం సాధించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో నాలుగు ఏజెన్సీలు తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నాయి, ఒక్క ఏజెన్సీ సరైన ఫలితాలు అంచనా వేస్తుందన్నారు. కొందరు ఓటర్లు ఇంకా క్యూ లైన్లలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం తమకు అనుకూల ఎగ్జిట్ పోల్స్ వచ్చేలా చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గెలుస్తుందని వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తప్పు అని డిసెంబర్ 3న నిరూపిస్తాం. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం 70 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను చెప్పింది నిజమో కాదో మరో మూడు రోజుల్లో తేలిపోతుందన్నారు. దాదాపు 90 సీట్లు నెగ్గుతామని మొదట్లో తాము భావించగా, కొన్ని కారణాలతో 70 సీట్లు నెగ్గుతున్నామని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జి్ట్ పోల్స్ పేరిట న్యూసెన్స్, నాన్ సెన్స్ చేసే వారికి డిసెంబర్ 3న నిజాలు తెలుస్తామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also Read: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం

ఏబీపీ సీఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్

తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో .. కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది కానీ.. అదే సమయంలో హంగ్ అసెంబ్లీ అంచనాలను కూడా తోసిపుచ్చలేమని ఏబీపీ సీఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో స్పష్టమయింది.  కాంగ్రెస్ పార్టీకి  49 నుంచి 65 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని తేలింది. అదే సమయంలో భారత రాష్ట్ర సమితికి 38  నుంచి 54 సీట్లు వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కూటమికి మూడు నుంచి 13 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇతరులు 5 నుంచి 9 స్తానాల్లో గెలుస్తారు. ఇతరుల్లో మజ్లిస్ పార్టీ కూడా ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget