Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు
Telangana Assembly Election 2023 LIVE updates: నేడు తెలంగాణ ఎన్నికలు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 నియోజకవర్గాల్లో జరుగుతున్న పోలింగ్‌కు సంబంధించిన సమాచారం ఇక్కడ లైవ్‌లో చూడవచ్చు.
LIVE

Background
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 70.60 శాతం ఓటింగ్
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 70.60 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలవనుంది. బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితం కానుంది.
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి స్పెషల్ లీవ్: వికాస్ రాజ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం నవంబర్ 29, 30 తేదీలలో పోలింగ్ విధులు నిర్వహించిన సిబ్బందికి శుక్రవారం ప్రత్యేక సెలవు ప్రకటించారు. స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని వికాస్ రాజ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Exit Polls Effect: రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు
తెలంగాణలో ఎన్నికలు ముగియడం, అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకి అధిక సీట్లు వస్తాయని రావడంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంచారు.
తెలంగాణలో ఇప్పటివరకూ 68 శాతం పోలింగ్
తెలంగాణలో ఇప్పటివరకూ 68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ముగిసి, ఈవిఎంలు సీల్ చేసి, స్ట్రాంగ్ రూంలకు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎంత రాత్రైనా పోలింగ్ ఎంత శాతం నమోదైందన్న వివరాలను ఎన్నికల సంఘం ఈ రోజే వెల్లడించాలన్నారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈసీ ని డిమాండ్ చేస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు విజ్ఞప్తి. పోలింగ్ ముగిసి, ఈవిఎంలు సీల్ చేసి, స్ట్రాంగ్ రూంలకు చేరే వరకు అప్రమత్తంగా ఉండండి.
— Revanth Reddy (@revanth_anumula) November 30, 2023
ఎంత రాత్రైనా పోలింగ్ ఎంత శాతం నమోదైందన్న వివరాలను ఎన్నికల సంఘం ఈ రోజే వెల్లడించాలి.
గత తప్పిదాలు పునరావృతం కాకుండా…
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

