Delhi New CM: ఢిల్లీ సీఎం ఎవరు? రేస్‌లో ఉన్న బీజేపీ నేతల బయోడేటా ఏంటీ?
New Delhi CM: ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు అక్కడ సీఎం ఎవరు అనే చర్చ మొదలైంది. ఈ రేసులో కీలక నేతలు పోటీ పడుతున్నారు.

New Delhi CM: 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి సీటులో ఎవర్ని కూర్చోబెట్టబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లు ప్రజల్లో ఉంటూ బీజేపీ విజయానికి కృషి చేసిన చాలా మంది ఆ రేసులో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరిని ఆ కుర్చీపై కూర్చునేందుకు బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టగల సమర్థ నాయకులు బీజేపీలో చాలా మంది ఉన్నారు. అందుకే పోటీ తీవ్రంగా ఉంది. అధిష్ఠానం అన్ని లెక్కలు వేసుకొని ఒక నేతను ఎంపి చేయాల్సి ఉంది. అది పార్టీ చాలా ఇబ్బందికర పరిణామం. ఇలా సీఎం పదవి కోసం పోటీ పడుతున్న వారిలో మాజీ సీఎం సాహిబ్ సింగ్ కుమారుడు పర్వేశ్ వర్మ, మాజీ ఎంపీ రమేష్ బిధురి, మంజీందర్ సింగ్ సిర్సా దుష్యంత్ గౌతమ్ ఉన్నారు.
పర్వేశ్ వర్మ
న్యూఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ సీఎం పదవికి పోటీలో ముందంజలో ఉన్నారు. గత సంవత్సరం బీజేపీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితా నుంచి మాజీ ఎంపీ వర్మను తొలగించారు. అయితే ఆయన ప్రాధాన్యత తగ్గించాలని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ ఈ ఎన్నికల కోసం ఆయన్ని పక్కన పెట్టారనే విషయం ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ముందుగానే ప్రణాళికలు వేసుకున్నట్టు స్పష్టమైంది.
బిజెపికి ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభ పెట్టాలని పర్వేశ్ వర్మపై ఆప్ ఆరోపణలు చేసింది. ఇక్కడ ఇంకో విషయంో ఆయనకు ఫేవర్‌గా ఉంది. 2008 నుంచి కూడా ఆయన విజయం సాధించిన నియోజకవర్గం నుంచే ఢిల్లీ సీఎంలు అవుతూ వచ్చారు. ఇప్పుడు కూడా అది రిపీట్ అవుతుందని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ఆప్, అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పర్వేశ్ వర్మ చాలా చాలా బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
యూపీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభావవంతమైన 'జాట్' సామాజికవర్గానికి చెందిన నేత కావడం కూడా పర్వేశ్‌కు బాగా ప్లస్ అవుతుంది. జాట్ నేతను ముఖ్యమంత్రిని చేయడం వల్ల రూరల్ ఢిల్లీ, పశ్చిమ యూపీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని జాట్ ఓటర్లకు మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది.
విజేందర్ గుప్తా
భారతీయ జనతా పార్టీ (బిజెపి) అగ్ర నాయకుల్లో విజయేందర్ గుప్తా ఒకరు. ఈయన రోహిణి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే. గత 10 సంవత్సరాల్లో "కేజ్రీవాల్ వేవ్"ను తట్టుకొని గెలుస్తూ వస్తున్నారు. అందుకే ఆయన కూడా సీఎం రేస్‌లో ఉన్నారు. ఆగస్టు 14, 1963న జన్మించిన గుప్తా 20 సంవత్సరాల వయసులో జనతా విద్యార్థి మోర్చా కార్యదర్శిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.
గుప్తా మూడుసార్లు రోహిణిలో కౌన్సిలర్‌గా, 2010 నుంచి 2013 వరకు ఢిల్లీ బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు. 2025 ఢిల్లీ ఎన్నికల్లో గుప్తా రోహిణి స్థానంలో ఆప్ అభ్యర్థి ప్రదీప్ మిట్టల్, కాంగ్రెస్ అభ్యర్థి సుమేష్ గుప్తాను ఓడించారు.
మంజీందర్ సింగ్ సిర్సా
మంజీందర్ సింగ్ సిర్సా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి. ఈయన కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న వారిలో టాప్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 28, 1972న జన్మించిన సిర్సా 2020లో ఓడిపోయిన రాజౌరి గార్డెన్ నియోజకవర్గం నుంచే ఇప్పుడు మళ్లీ గెలిచారు. ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీ గురు తేగ్ బహదూర్ ఖల్సా కళాశాల మాజీ విద్యార్థి.
2017 ఉపఎన్నికల్లో రాజౌరి గార్డెన్‌లో బిజెపి, అకాలీదళ్ నుంచి ఉమ్మడి ఎమ్మెల్యే సిర్సా ఉన్నారు. డిసెంబర్ 2021లో శిరోమణి అకాలీదళ్ (SAD)కి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. సిర్సా ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 2013లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మోహన్ సింగ్ బిష్ట్
మోహన్ సింగ్ బిష్ట్ భారతీయ జనతా పార్టీ (BJP)లో సీనియర్ నాయకుడు. ఆయన జూన్ 2, 1957న జన్మించారు. బిష్ట్ ప్రస్తుతం కరావాల్ నగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆయన 1998, 2003, 2008, 2013 2020లలో వరుసగా ఎన్నికయ్యారు.
Also Read: నిజమే ఢిల్లీ ఎన్నికల్లో ఆఫ్‌ను ఓడించింది కాంగ్రెసే- పొత్తుతో వెళ్లుంటే లెక్కలు మారేవా?
బిష్ట్ రాజకీయం 1976లో భారతీయ జనసంఘ్‌లో చేరినప్పుడు ప్రారంభమైంది. 1992లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో చేరారు. బిష్ట్ విశ్వహిందూ పరిషత్‌లో కూడా క్రియాశీల సభ్యుడు. 2020కి ముందు, బిష్ట్ కరావాల్ నగర్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1998, 2003, 2008, 2013లో వరుసగా ఎన్నికయ్యారు. 2015లో ఆయన ఆప్‌లో నేత కపిల్ మిశ్రా చేతిలో ఓడిపోయారు.
2025లో కరవాల్ నగర్ అభ్యర్థిగా బిష్ట్ స్థానంలో మిశ్రాను బిజెపి నియమించింది. తరువాత ముస్తఫాబాద్ నుంచి బిష్ట్‌ను నిలబెట్టింది. బిష్ట్ ఆ స్థానాన్ని గెలుచుకుంది.
సతీష్ ఉపాధ్యాయ్
బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 'బ్రాహ్మణ' వర్గానికి చెందిన నేతగా మంచి పేరు ఉంది. ఢిల్లీ యువ మోర్చా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ప్రస్తుతం NDMC వైస్ చైర్మన్‌గా పని చేస్తున్నారు. పరిపాలనా అనుభవం కూడా ఉంది. పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో బలమైన అనుబంధం ఆయనకు కలిసి వచ్చే అంశం.
ఆశిష్ సూద్
ఆశిష్ సూద్‌ది పంజాబీ ఫేస్. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ కౌన్సిలర్‌గా ఉన్నారు. పార్టీ జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం గోవా ఇన్‌చార్జ్, జమ్మూ కాశ్మీర్ సహ-ఇన్‌చార్జ్‌గా పని పని చేస్తున్నారు. కేంద్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
Also Read: ఢిల్లీ సీఎం రేసులో జెయింట్ కిల్లర్ పర్వేష్ వర్మ - ఆయన అస్తులెన్నో తెలిస్తే షాకే !
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

