SIR India Phase 2:ఎన్యుమరేషన్ ఫామ్ అంటే ఏమిటి? దాన్ని నింపేందుకు ఏ సమాచారం అవసరం?
SIR India Phase 2:ఎన్యుమరేషన్ కేవలం కాగితం కాదు, ఇది పౌరసత్వం, ఓటు హక్కుల గుర్తింపు. సక్రమంగా నింపడం ప్రతి పౌరుడి బాధ్యత.

What is Enumeration form : బీహార్‌లో విజయం సాధించిన తర్వాత, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో సహా 12 రాష్ట్రాల్లో తదుపరి దశ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రారంభమవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సోమవారం ప్రకటించారు. ఈ రాష్ట్రాల్లో మంగళవారం ఒకేసారి సర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. కమిషన్ ప్రకారం, ఈ రెండో దశలో, ఓటరు జాబితాను కొత్తగా నవీకరిస్తారు. ఇంకా జాబితా చేయని వారి పేర్లు చేర్చుతారు, గతంలో నమోదు చేసిన రికార్డులలో ఏవైనా లోపాలు కూడా ఈ దశలో సరి చేస్తారు.ఎన్యుమరేషన్ అంటే ఏమిటి ?దానికి ఏ సమాచారం అవసరమో చూద్దాం.
ఎన్నికల సంఘం ఓటరు జాబితాలో పేర్లను ఎలా యాడ్ చేస్తుంది?
మీ పేరు ఓటరు జాబితాలో ఎలా యాడ్ చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదా ఎన్నికల కమిషన్ మీ చిరునామా, గుర్తింపును ఎలా ధృవీకరిస్తుంది? సమాధానం ఎన్యుమరేషన్ అనే ఫారంలో ఉంది. ఇది మీ పౌరసత్వం, ఓటరు గుర్తింపు రెండింటికీ ఇదే ముఖ్యమైన పత్రం. కానీ కొంతమందికి దీన్ని ఎలా పూరించాలో, ఎక్కడ తీసుకోవాలో ఏ సమాచారాన్ని అందించాలో తెలియదు
ప్రతి భారతీయుడికి ఎన్యుమరేషన్ ఫామ్ చాలా అవసరం
భారతదేశంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సమయంలో, ఎన్యుమరేషన్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఫారం ఏమిటి, అది ఎందుకు అవసరం? దానిలో ఏ వివరాలు నింపాలి అనేది ప్రతి పౌరుడు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎన్నికల కమిషన్ ప్రకారం, ఎన్యుమరేషన్ అనేది మీ వ్యక్తిగత, కుటుంబ వివరాలు ఓటర్ల జాబితాలో సరిగ్గా నమోదు చేశాయని నిర్ధారించే పత్రం. దీన్ని పూర్తి చేసిన తర్వాత, మీ రికార్డును BLO ధృవీకరిస్తారు. ఓటు హక్కు ఉన్న ప్రతి భారతీయ పౌరుడికి ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకం, తప్పనిసరి.
ఎన్యుమరేషన్ అంటే ఏమిటి?
ఎన్యుమరేషన్ అనేది ఎన్నికల కమిషన్ తయారుచేసిన వివరణాత్మక పత్రం, ఇది వ్యక్తులు వారి గుర్తింపు, నివాస స్థలం, కుటుంబ వివరాలు, పుట్టిన తేదీ, పౌరసత్వం గురించి సమాచారాన్ని అందించాలి. ఈ ఫారం ఫారం-6 మాదిరిగానే ఉంటుంది, కానీ ఇందులో ఓటరు జాబితా సవరణకు సంబంధించిన వివరణాత్మక సమాచారం ఉంటుంది.
దీనిలో ఏ సమాచారం ఇవ్వాలి?
ఈ ఫారమ్‌లో, మీరు కొన్ని ప్రాథమిక, కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని అందించాలి-
- పూర్తి పేరు (హిందీ, ఆంగ్లంలో)
- తండ్రి, తల్లి లేదా భర్త/భార్య పేరు
- శాశ్వత, ప్రస్తుత చిరునామా
- జనన తేదీ , వయస్సు
- మొబైల్ నంబర్, ఇమెయిల్ ID (ఐచ్ఛికం)
- గుర్తింపు నంబర్ (ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి)
- విద్యా అర్హత, వృత్తి
- పేరు ఇప్పటికే ఏదైనా ఇతర ప్రాంతంలో నమోదు చేసి ఉంటే, ఆ సమాచారాన్ని కూడా ఇవ్వాలి.
ఈ ఫారమ్‌ను ఎక్కడ పొందగలరు దానిని ఎలా పూరించాలి?
ఎన్యుమరేషన్ రెండు విధాలుగా పొందవచ్చు - ఆఫ్‌లైన్, ఆన్‌లైన్.
ఆఫ్‌లైన్ ప్రక్రియ:
మీరు మీ ప్రాంతంలోని BLOని నేరుగా సంప్రదించవచ్చు. ఈ అధికారులు మీ వార్డు లేదా గ్రామంలో ఉంటారు. వారు మీకు ఒక ఫారమ్‌ను అందిస్తారు, దానిని మీరు చేతితో పూరించవచ్చు. పూర్తయిన తర్వాత, అవసరమైన పత్రాలతో (గుర్తింపు రుజువు, చిరునామా రుజువు వంటివి) పాటు సమర్పించండి.
ఆన్‌లైన్ ప్రక్రియ:
మీరు ఇంటి నుంచి దీన్ని పూరించాలనుకుంటే, https://www.nvsp.in వద్ద ఉన్న నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (NVSP) వెబ్‌సైట్‌ను సందర్శించండి. చేరిక/సవరణ కోసం ఫారమ్ విభాగానికి వెళ్లి, అవసరమైన వివరాలను పూరించండి, మీ పత్రాలను అప్‌లోడ్ చేయండి. సమర్పించండి. సమర్పించిన తర్వాత, మీ దరఖాస్తు స్టాటస్‌ను ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే రసీదు నంబర్ మీకు అందుతుంది.
మీ BLO ఎవరు ? ఎక్కడ ఉంటారు ?
ప్రజలు తరచుగా వారి BLO ఎవరో తెలియదు. ఈ సమాచారాన్ని కనుగొనడం చాలా సులభం. NVSP పోర్టల్ లేదా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను సందర్శించి, మీ జిల్లా, నియోజకవర్గాన్ని నమోదు చేయండి. "మీ BLO గురించి తెలుసుకోండి" ఎంపికపై క్లిక్ చేయండి. మీరు BLO పేరు, మొబైల్ నంబర్, కార్యాలయ చిరునామాను చూస్తారు.
ఈ ఫారమ్ ఎందుకు అవసరం?
ఎన్యుమరేషన్ మీ పేరు ఓటరు జాబితాలో సరిగ్గా నమోదు చేసినట్టు నిర్ధారించడమే కాకుండా, మీరు భారతీయ పౌరుడని, సరైన నియోజకవర్గంలో ఓటు వేయడానికి అర్హులని కూడా రుజువు చేస్తుంది. ఈ ప్రక్రియ దేశంలో పారదర్శక ఎన్నికల వ్యవస్థకు వెన్నెముకగా పరిగణిస్తున్నారు.





















