(Source: ECI/ABP News/ABP Majha)
Priyanka Gandhi Election Result 2024: వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఘన విజయం - రాహుల్ గాంధీ మెజార్టీ రికార్డ్ గల్లంతు
Wayanad Bypolls 2024: వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ సీపీఐ తరఫున సత్యన్ మొకేరి, బీజేపీ నుంచి నవ్య హరిదాస్ పోటీ పడ్డారు.
Wayanad Byelection 2024: కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అద్భుత ప్రదర్శన చేశారు. ఇది ఆమె ఎన్నికల అరంగేట్రం అదిరిపోయింది. సోదరుడు రాహుల్ గాంధీ గతంలో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు చెల్లెలు కూడా అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వయనాడ్‌లో జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ భారీగా ఓట్లు సాధించారు. గతంలో రాహుల్ గాంధీ 3.6 లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గగా, ప్రస్తుత ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై ప్రియాంక గాంధీ 4 లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వయనాడు ఎంపీ ప్రియాంకకు స్వీట్ తినిపించారు. ఆమెను శాలువా కప్పి సన్మానించారు. ఎన్నికల్లో పోటీ చేసింది తొలిసారి అయినా, రికార్డు మెజార్టీతో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పేరు నెలబెట్టారని ఖర్గే ప్రశంసించారు. ప్రియాంక గాంధీ తర్వాత సీపీఐ సీనియర్ నాయకుడు సత్యన్ మొకేరి రెండవ స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడో స్థానంలో నిలిచారు. వయనాడ్‌లో మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
2019లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయినప్పటికీ వయనాడ్ నుంచి విజయం సాధించారు. దీంతో లోక్‌సభ సభ్యత్వాన్ని నిలుపుకున్నారు. 2024లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలీ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల్లో విజయం సాధించారు. దీని తర్వాత ఆయన రాయ్ బరేలీని తన సీటుగా ఎంచుకున్నారు. తన సోదరి ప్రియాంక గాంధీని వయనాడ్ నుంచి పోటీ చేయమని సూచించారు.
ప్రియాంకకు రాహుల్, సోనియా మద్దతు
ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ సోదరుడు రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీ చురుకుగా పాల్గొన్నారు. వయనాడ్‌ను గొప్ప పర్యాటక కేంద్రంగా మార్చాలని రాహుల్ గాంధీ, ప్రియాంక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫలితంగా ఆర్థికంగా వృద్ధి చెందుతుంది, ప్రజలకు మంచి ఉపాధి లభిస్తుందని ప్రచారం చేశారు. వయనాడ్ ప్రకృతి అందాలు ప్రపంచ వ్యాప్తం అవుతాయని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు వాయనాడ్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
ప్రియాంక గాంధీభవిష్యత్తు వయనాడ్
ప్రియాంక గాంధీ వాయనాడ్ ప్రజల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. తన ప్రచార సమయంలో ఆమె వాయనాడ్‌ను అభివృద్ధి చేసి, కొత్త గుర్తింపు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పర్యాటకులు ముందుగా రావాలనుకునే ప్రాంతంగా వయనాడ్‌ను తయారు చేయాలని ప్రియాంకకు రాహుల్ గాంధీ సూచించారు. ఇది వయనాడ్‌ను బలోపేతం చేయడమే కాకుండా ఆ ప్రాంతానికి ఆర్థిక పరిపుష్టిని ఇస్తుందని అన్నారు.
ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూపు
వయనాడ్ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉండటంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వస్తున్నాయి. ఈ ఎన్నికలు భారత రాజకీయాలను మరో దశకు తీసుకెళ్తాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Also Read: మహారాష్ట్ర సీఎంగా దేవేందర్ ఫడ్నవీస్ -బీజేపీ సునామీతో మారిపోనున్న లెక్కలు!