అన్వేషించండి

AP Election Counting Updates 2024: కౌంటింగ్‌రోజు వేషాలు వేస్తే తాటతీస్తా- అల్లరిమూకలకు పల్నాడు ఎస్పీ మలికా మాస్ వార్నింగ్

Palnadu News: ఓట్ల లెక్కింపు రోజు లా ఆండ్‌ ఆర్డర్‌కు ఎవరు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని పల్నాడు ఎస్పీ మల్లికాగార్గ్‌ హెచ్చరించారు. ఇప్పటికే రావాల్సిన మంచి పేరు వచ్చిందని సటైర్లు వేశారు.

Andhra Pradesh News: పల్నాడు జిల్లాలో  పోలింగ్ అనంతరం హింసపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగడంతో పోలీసుశాఖ(Police)పై తీవ్ర విమర్శలు తలెత్తాయి.  రాజకీయ నేతలకు పోలీసులు తొత్తులుగా మారారని...బహిరంగంగా వార్నింగ్‌లు ఇస్తున్నా...ఊర్లపైపడిపోయి అరాచకం సృష్టిస్తున్నా పట్టించుకోకపోవడంతో రెచ్చిపోయిన అల్లరిమూకలు ఏకంగా పోలీసుల తలనే పగులగొట్టారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం(CEC) సైతం తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేయడంతో డీజీపీ(DGP)....లేడీ సింగంగా పేరుగాంచిన మలికాగార్గ్‌(Mallika Garg)ను ఎస్పీగా నియమించారు. పేరుకు తగ్గట్టుగానే ఆమె అల్లరి మూకలకు మాస్‌వార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్‌ రోజు ఎవరైనా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తాటతీస్తామని హెచ్చరించారు..

మలికా మాస్‌ వార్నింగ్..
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామని పల్నాడు(Palnadu) ఎస్పీ మలికాగార్గ్ హెచ్చరించారు. రాజకీయ నాయకులు లా అండ్‌ ఆర్డర్‌ను గౌరవించాలని...లేనిపక్షంలో ఏ పార్టీవారైనా చర్యలు తీసుకోవడం తప్పదని  ఆమె స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలో ప్రశాంతత కోసం పోలీసుశాఖ కృషి చేస్తోందని...దీనికి విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదన్నారు. పోలీసు అధికారులు తప్పుచేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. పల్నాడు జిల్లావ్యాప్తంగా 150 సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగిందని ఆమె తెలిపారు. గొడవలు, ఘర్షణలకు పాల్పడే అవకాశం ఉన్న1666 మందిని సైతం పోలీసుశాఖ గుర్తించందన్నారు. నిరంతరం ఆయా వ్యక్తులపైన నిఘా కొనసాగుతుందన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇప్పటికే 150కి పైగా కేసులు పెట్టామని...దర్యాప్తు అనంతరం ఇందులో నిందితులుగా ఉన్న వారిపై రౌడీషీట్లు తెరుస్తామన్నారు మల్లికా. బైండోవర్ కేసుల్లో ఉన్నవారు లక్ష నుంచి రెండు లక్షల వరకు స్థానిక తహసీల్దార్ వద్ద డిపాజిట్ చేయిస్తున్నామన్నారు. అలాంటి వారు ఏదైనా గొడవకు దిగితే డిపాజిట్ చేసిన సొమ్ము వెనక్కి తిరిగి ఇవ్వబోమన్నారు. జిల్లావ్యాప్తంగా కార్డన్  సెర్చ్‌ కొనసాగుతోందని....అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నామన్నారు. వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు....విడిగా పెట్రోలు కలిగి ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా 700 మంది కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Embed widget