Gudivada Amarnath: మీరు రాసుకోవాలి, మాకు అవసరం లేదు, పరిగెత్తించి కొడతాం: మంత్రి అమర్నాథ్
Gudivada Amarnath strong warning to tdp leaders lokesh, anitha : మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితపై మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh News: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితపై మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాయకరావుపేటలో నిర్వహించిన సభలో మంత్రి గుడివాడ అమర్నాథ్ వీరిద్దరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలపై అధికారంలోకి వస్తే బదులు తీర్చుకుంటామంటూ లోకేష్ పుస్తకాల్లో రాసుకుంటున్నాడని, తమకు, తమ పార్టీ కార్యకర్తలకు పుస్తకాలు అవసరం లేదని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. ఏదైనా తేడా వస్తే పరిగెత్తించి కొడతానని మంత్రి అమర్ స్పష్టం చేశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతిపైన టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే పరిగెత్తించి కొట్టడం ఖాయమని వెల్లడించారు. ఆవిడ గురించి తాను మాట్లాడితే ఆమె స్థాయి పెరుగుతుందని, ఇకపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి అమర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. అనిత, లోకేష్ ని తీసుకొచ్చి నియోజకవర్గంలో తిప్పిందని, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదని మంత్రి అన్నారు. మాజీ ఎమ్మెల్యే అనిత కోసం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుందని, అది తనకు ఇష్టం లేదన్న అమర్నాథ్.. బాగా మాట్లాడాలని సూచించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారని, ఈ తరహా మాటలు మానుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ఈ తరహా నేతలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, వచ్చే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా వైసీపీ ప్రభుత్వం
నిరుపేదలకు అండగా ఉండేలా అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తుందని మంత్రి అమర్నాథ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మేలు చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలని ఆయన కోరారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అనవసర ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పెద్దపెద్ద వాళ్లు ఆర్థికంగా లబ్ది పొందాలని, వైసీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు మేలు జరుగుతోందని వెల్లడించారు. అమర్నాథ్ మాట్లాడుతున్నంత సేపు పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు, హర్షద్వానాలతో ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి అమర చేసిన వ్యాఖ్యలకు పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే అనిత అంతే స్థాయిలో స్పందించారు. తన గురించి మాట్లాడితే గుడ్డు పగులుతుంది అంటూ కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడ్డు కిందకు వేసి మరి గుడ్డు పగులుతుంది అంటూ హెచ్చరించారు. ఈ ఇద్దరు నేతలు మధ్య మాటల, తూటాలు పేలుతుండడంతో ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారాయి.