అన్వేషించండి

Exit Polls vs Opinion Polls : ఎగ్జిట్ పోల్స్‌ అంటే ఏంటీ? ఒపీనియన్ పోల్స్‌కు వీటికి ఉన్న తేడా ఏంటీ? 

Exit Polls vs Opinion Polls : భారత్‌లో ఎన్నికల ప్రక్రియలో ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇవి ఓటర్లను ప్రభావితం చేయకుండా ఈసీ కఠిన రూల్స్ పెట్టింది

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎన్నికల ముందు ఒపీనియన్ పోల్స్, పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు.
  • ఎగ్జిట్ పోల్స్ ఓటరు అభిప్రాయాన్ని సేకరించి అంచనాలు తెలియజేస్తాయి.
  • అన్ని దశల పోలింగ్ తర్వాతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాలి.
  • ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎల్లప్పుడూ కచ్చితంగా ఉండవని గమనించాలి.

Exit Polls vs Opinion Polls : ప్రజాస్వామ్య భారత్‌లో ఎన్నికలు అంటే కేవలం ఓట్లు వేయడం మాత్రమే కాదు. ఆ ఓటు ఫలితం ఏంటో తెలుసుకోవాలని ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే ప్రజల నాడిని పట్టుకోవాలని ప్రయత్నించే చర్య సర్వేలు. ప్రస్తుతం 2026లో ఐదు రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌ కూడా వచ్చాయి. అయితే ఈ సర్వేలు ఎలా చేస్తారు. వీటికి ఉండే చట్టబద్ధత ఏంటీ అనే విషయాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. 

ఒపీనియన్ పోల్ అంటే...

ఒపీనియర్ పోల్ లేదా అభిప్రాయ సేకరణ అనేది ఎన్నికలు ప్రారంభంకావడానికి ముందే నిర్వహించే సర్వే. నామినేషన్ల ప్రక్రియకు ముందు లేదా ప్రచారం జరుగుతున్న సమయంలో వీటిని చేపడతారు. ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, వారి ప్రధాన సమస్యలు ఏంటీ, ప్రచార పద్ధతులు ఓటర్లను ఎంత వరకు ప్రభావితం చేస్తున్నాయి అనేది తెలుసుకోవడానికి సర్వేలు చేస్తారు. శాంపిల్ సైజ్ నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. ఎన్నికల ప్రచారం సాగుతున్న కొద్దీ ప్రజల అభిప్రాయాలు మారే ఛాన్స్ ఉంది. అందుకే ఒపీనియన్ పోల్ ఫలితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. 

ఎగ్జిట్ పోల్ అంటే ..

ఎగ్జిట్ పోల్ అనేది ఓటు వేసిన తర్వాత బయటకు వచ్చిన ఓటరు అభిప్రాయాన్ని నేరుగా సేకరించే ప్రక్రియ. ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే పోలింగ్ కేంద్రం వెలుపల ఈ సర్వే చేస్తారు. సర్వే చేసే వ్యక్తులు పోలింగ్ బూత్ బయట వేచి ఉండి, ఓటు వేసి వస్తున్న వారిని మీరు ఎవరికి ఓటు వేశారు అని అడిగి తెలుసుకుంటారు. ఓటరు తన నిర్ణయాన్ని అమలు చేసిన తర్వాత చెప్పే మాటలు కాబట్టి ఇవి ఒపీనియన్ పోల్స్ కంటే కాస్త కచ్చితత్వానికి దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఇవి కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమే. అధికారిక ఫలితాలు కావు. 

ఎన్నికల సంఘం రూల్స్ 

ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసింది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ ప్రసారంపై ఆంక్షలు విధించింది. ఎన్నికలు ఒకటి కంటే ఎక్కువ దశల్లో జరుగుతున్నప్పుడు అన్ని దశల పోలింగ్ పూర్తి అయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించకూడదు. ఇవాళ కూడా దీన్ని అమలు చేసింది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై ఆరు గంటలకు ముగిసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆరున్న తర్వాత వెల్లడించారు. ఈ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ ఉంటాయి. 

సర్వేలు నిర్వహించే పద్ధతులు

మీడియా సంస్థలు, పరిశోధన ఏజెన్సీలు, పోలింగ్ సంస్థలు వివిధ పద్ధతుల ద్వారా డేటాను సేకరిస్తాయి. క్షేత్రస్థాయిలో ఓటర్లతో మాట్లాడటం ద్వారా, టెలీఫోన్ ద్వారా ఓటర్ల అభిప్రాయం తెలుసుకుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో టీంలను పంపించి సమాచారాన్ని సేకరిస్తారు. 

ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సంస్థలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఓటింగ్ సరళిని అంచనా వేయడానికి ఈ పద్దతులను అనుసరించాయి. 

ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా

ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం సంకేతాలు మాత్రమే ఇవి ఎప్పుడూ కచ్చితంగా ఉంటాయని చెప్పలేం. అనేక సందర్భాల్లో ఎగ్జిట్‌పోల్ అంచనాలు లెక్క తప్పుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒకట్రెండు మినహా మిగతా సర్వే సంస్థల లెక్కలు తెప్పాయి.  

Frequently Asked Questions

ఒపీనియన్ పోల్ అంటే ఏమిటి?

ఒపీనియన్ పోల్ అనేది ఎన్నికలు ప్రారంభం కాకముందే లేదా ప్రచారం జరుగుతున్న సమయంలో నిర్వహించే సర్వే. ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, వారి సమస్యలు ఏమిటి అని తెలుసుకోవడానికి దీనిని చేస్తారు.

ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటి?

ఎగ్జిట్ పోల్ అనేది ఓటు వేసిన తర్వాత బయటకు వచ్చిన ఓటరు అభిప్రాయాన్ని నేరుగా సేకరించే ప్రక్రియ. పోలింగ్ కేంద్రం వెలుపల ఓటరు ఎవరికి ఓటు వేశారు అని అడిగి తెలుసుకుంటారు.

ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వెల్లడించాలి?

ఎన్నికలు ఒకటి కంటే ఎక్కువ దశల్లో జరిగితే, అన్ని దశల పోలింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించకూడదు. పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే వీటిని ప్రచురించాలి.

ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నమ్మదగినవి?

ఎగ్జిట్ పోల్స్ కేవలం సంకేతాలు మాత్రమే, అవి ఎల్లప్పుడూ కచ్చితంగా ఉండవు. అనేక సందర్భాల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పుతాయి.

టాప్ హెడ్ లైన్స్

AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
TDP First List: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
AP Local Body Polls: ఏపీ స్థానిక పోరులో రణరంగం.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
స్థానిక పోరులో మొదలైన రచ్చ.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget