అన్వేషించండి

Assembly Elections 2026 Exit Poll Results Live Updates: తమిళనాడు విజయ్‌దేనంటున్న యాక్సిస్‌ మై ఇండియా సర్వే

Exit Poll Results Live Updates: తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు విడుదలవుతున్నాయి. ఆరున్నర నుంచి వివిధ సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తాయి. 

LIVE

Key Events
tamil nadu west Bengal assam kerala assembly election exit poll results 2026 live updates Assembly Elections 2026 Exit Poll Results Live Updates: తమిళనాడు విజయ్‌దేనంటున్న యాక్సిస్‌ మై ఇండియా సర్వే
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌! బెంగాల్‌లో, తమిళనాడులో ఎవరికి ఛాన్స్? అంచనాలపై లైవ్ అప్‌డేట్స్!
Source : Social Media

Background

Assembly Elections 2026 Exit Poll Results Live Updates: భారత్ రాజకీయ ముఖచిత్రాన్ని నిర్ణయించే కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. పశ్చిమెంబగాల్‌లో చివరి దశ పోలింగ్ ముగియడంతో అందరి కళ్లు ఎగ్జిట్ పోల్స్‌పై పడ్డాయి. తమిళనాడు, పశ్చమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓటర్ల నాడి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ అటు రాజకీయ పార్టీల్లోనూ ప్రజల్లో ఉంది. 

ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాల్సి ఉంటుంది. ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది. ఇంకా లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇస్తున్నందున మరో అరగంటను గ్రేస్ పిరియడ్‌గా ఇస్తారు. అందుకే ఆరున్నర నుంచి వివిధ ఏజెన్సీలు సీట్ల అంచనాలను ఓట్ల శాతాన్ని ప్రకటించడం ప్రారంభిస్తాయి. వీటి కోసం ఏబీపీ దేశం వెబ్‌సైట్‌తోపాటు నెట్‌వర్క్ సైట్లను చూడవచ్చు. 

తమిళనాడులో 234 స్థానాలకు జరిగిన పోరులో ప్రధానంగా అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే మధ్య గట్టి పోటీ ఉంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొలత్తూరు నుంచి ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళని స్వామి ఎడప్పాడి నుంచి పోటీ చేశారు. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమళగ వెట్రి కజగం ఈసారి ఎన్నికల్లో కొత్త సమీకరణాలను సృష్టించింది. 

గత ఎన్నికల్లో డీఎంకే సొంతంగా 133 సీట్లు సాధించింది. దాని కూటమి 159 సీట్లు సాధించింది. అన్నా డీఎంకే 66 సీట్లకే పరిమితమైంది. 

పశ్చిమ బెంగాల్‌ టైగర్ ఎవరు 

పశ్చిమ బెంగాల్‌ 294 సీట్ల కోసం జరిగిన హోరాహోరీ పోరులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, బీజేపీ మధ్య పోరు సాగింది. భవానీపూర్‌ నియోజకవర్గంలో మమతపై బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. టీఎంసీ తన సంక్షేమ పథకాలపై నమ్మకం పెట్టుకోగా, బీజేపీ ఉత్తర బెంగాల్‌లో తన పట్టును నిపులుకుంటుూ దక్షిణ బెంగాల్‌లో కొత్త స్థానాల్లో పట్టు సాధించాలని చూస్తోంది. 

బెంగాల్‌లో తొలి దశలోనే రికార్డు స్థాయిలో 93.19 శాతం ఓటింగ్ నమోదు అయింది. రెండో విడత పోలింగ్‌లో కూడా అదే స్థాయి రికార్డు నమోదు అవుతుంది. 

అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. అక్కడ హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ కసితో ఉంది. కేరళలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ మధ్య పోరు ఉంది. ఇక్కడ బీజేపీ కూడా ఉనికి చాటుకోవాలని ట్రై చేసింది. పుదుచ్చేరీలో ఇక్కడ ఎన్డీఏ, ఇడీ కూటమి మధ్య పోటీ ఉంది. 

ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటీ 

ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు పడితే అప్పుడు విడుదల చేయడానికి లేదు. సెక్షన్ 126ఏ ప్రకారం దశలవారీగా ఎన్నికలు జరుగుతున్న టైంలో చివరి దశ పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్స్‌ ఇవ్వకూడదు. 

ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు ప్రజల నాడిని తెలియజేసినప్పటికీ తుది ఫలితాలు మాత్రం మే 4న వెల్లడవుతాయి. అప్పటి వరకు ఈ అంచనాలపై చర్చలు, విశ్లేషణలు కొనసాగుతూనే ఉంటాయి.                    

19:53 PM (IST)  •  29 Apr 2026

Assembly Elections 2026 Exit Poll Results Live Updates: తమిళనాడు విజయ్‌దేనంటున్న యాక్సిస్‌ మై ఇండియా సర్వే

 Assembly Elections 2026 Exit Poll Results Live Updates: తమిళనాడు రాజకీయాల్లో యాక్సిస్‌ మై ఇండియా సర్వే సంచలనం సృష్టిస్తోంది. ఆ సంస్థ ఇచ్చిన సర్వాలో విజయ్ పార్టీకి 98 నుంచి 120 స్థానాలు గెలుచుకుంటాడని చెబుతోంది. ఇప్పటి వరకు అన్ని సర్వే సంస్థలు డీఎంకేదే పీటమని చెబుతుంటే ఇప్పుడు తాజాగా వచ్చిన యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రభంజనం సృష్టిస్తోంది. 

18:55 PM (IST)  •  29 Apr 2026

Assembly Elections 2026 Exit Poll Results Live Updates:పోల్ డైరీ బీజేపీకి 142-171 సీట్లు!

Assembly Elections 2026 Exit Poll Results Live Updates: పోల్ డైరీ ప్రకారం, టీఎంసీకి 99-127 సీట్లు, బీజేపీకి 142-171, కాంగ్రెస్‌కు 3 నుంచి 5, ఇతరులకు 5 నుంచి 9 సీట్లు లభించే అవకాశం ఉంది.

 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget