UP Election 2022: ప్రధాని అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్- ఆసక్తికర సమధానమిచ్చిన అమిత్ షా
UP Election 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. యోగిని భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా చూస్తున్నారా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు.
UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా భాజపా భావిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి, భాజపా చాణక్యుడు అమిత్ షా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యోగిని.. కాబోయే ప్రధానిగా ప్రజలు భావించడం సహజమేనన్నారు.
సహజమే
యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అయితే సీఎం యోగిని కాబోయే ప్రధాని అభ్యర్థిగా ప్రజలు చూస్తున్నారని, దీనిపై మీరేమంటారు అని అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానమిచ్చారు.
శాంతిభద్రతలు
రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగు పరిచేందుకు యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా శ్రమించారు. అలానే రహదారుల అనుసంధానాన్ని అభివృద్ధి చేశామని.. గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించామన్నారు.
మళ్లీ గెలుపు ముఖ్యం
2024లో నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడు యోగి ఆదిత్యానాథ్ గెలుపు భాజపాకు కీలకమని భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు అమిత్ షా.. యూపీ తమకు చాలా కీలకమన్నారు.