అన్వేషించండి

INDIA Alliance in UP: యూపీలో ఇండియా కూటమి సీట్ల సర్ధుబాటు కొలిక్కి - ఆ పార్టీలకు సానుకూలమేనా!

Adjustment of seats of India alliance in UP: ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌, ఎస్సీ మధ్య సీట్ల పంపకాలు దాదాపు కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు. ఇది ఇండియా కూటమిలోని పార్టీలకు సానుకూల అంశంగా చెప్పవచ్చు. 

Adjustment of Seats Of India Alliance in UP: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో అనేక పార్టీలు కలిపి ఇండియా కూటమిగా ఏర్పాటయ్యాయి. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి ఒకే అభ్యర్థిని బీజేపీపై పోటీ ఉంచాలని, అప్పుడే బీజేపీపై విజయం సాధించడం సాధ్యమవుతుందని కూటమి భావించింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ప్రక్రియలో అవాంతరాలు ఏర్పడడం, కూటమి కన్వీనర్‌గా, ఎన్నికల తరువాత ప్రధాన మంత్రి అభ్యర్థి ఎంపిక తదిర అంశాలపై ఏకాభిప్రాయం రాకపోవడంతో పలు పార్టీలు ఆదిలోనూ కూటమి నుంచి వైదొలిగాయి. ఇందులో కీలకమైన బీహార్‌కు చెందిన నితీష్‌ కుమార్‌ పార్టీ కూడా ఉంది. ఆయన ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లడమే కాకుండా బీజేపీతో కలిసి సర్కారును ఏర్పాటు చేసుకున్నారు. గడిచిన కొన్నాళ్ల నుంచి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న ఆయన.. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన వెంటనే బీజేపీకి స్నేహహస్తం చాచారు. అదే పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇండియా కూటమి ముందుకెళ్లడం సాధ్యమనుకుంటున్న తరుణంలో దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి మధ్య సీట్ల పంపకాలు సాఫీగా సాగుతున్నాయి. కూటమిలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, ఎస్సీ మధ్య సీట్ల పంపకాలు దాదాపు కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు. ఇది ఇండియా కూటమిలోని పార్టీలకు సానుకూల అంశంగా చెప్పవచ్చు. 

ఎస్పీకి 62 సీట్లు.. కాంగ్రెస్‌కు 17 సీట్లు

దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌, ఎస్పీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇక్కడ సీట్ల పంపకాలు అంత వేగంగా కొలిక్కి వచ్చే అవకాశం లేదని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా సీట్ల సర్ధుబాటు ప్రక్రియ సాఫీగా సాగుతున్నట్టు చెబుతున్నారు. దాదాపు సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండగా, కాంగ్రెస్‌ 17 స్థానాల్లో, ఎస్పీ 62 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించినట్టు చెబుతున్నారు. ఒకచోట ఆజాద్‌ సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయనుంది. కాంగ్రెస్‌, ఎస్పీ మధ్యయ సయోధ్యలో కుదరడంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించినట్టు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో 29 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఖజురహో స్థానంలో యూపీ పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్ధతు ఇవ్వనుంది. 

మిగిలిన రాష్ట్రాల పరిస్థితి

దేశంలోని కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన పార్టీ అయిన ఎస్పీతో పొత్తు తేలడంతో కూటమి నేతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో పొత్తులు తేలాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి అసలు కూటమిలో ఉన్నారో, లేరో కూడా తెలియని పరిస్థితి ఉంది. గతంతో నిర్వహించిన ఒక సమావేశానికి ఆమె హాజరు కాలేదు. ఆఫ్‌ కూడా కూటమిలో ఉంటుందా..? లేదా..? అన్న దానిపై స్పష్టత లేదు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో పొత్తుల లెక్కలు తేల్చి ఎన్నికలకు సిద్ధం కావాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఆ దిశగానే కాంగ్రెస్‌ కూడా నిర్ణయాలను తీసుకుంటోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TVK Election Manifesto 2026: జాబ్ క్యాలెండర్, 20 లక్షల పూచీకత్తు లేని రుణాలు.. టీవీకే పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోపై విజయ్
జాబ్ క్యాలెండర్, 20 లక్షల పూచీకత్తు లేని రుణాలు.. టీవీకే పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోపై విజయ్
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 MI Vs KKR Result Update: ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
MI vs KKR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీగా అరుదైన ఘనత.
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీగా అరుదైన ఘనత.
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
Dacoit Chichubuddi Song : స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Embed widget