అన్వేషించండి

ABP CVoter Opinion poll Andhra Pradesh : ఏపీలో ఎన్డీఏ కూటమి సునామీ ఖాయమా ? ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో సంచలన ఫలితాలు

ABP CVoter Survey : ఏబీపీన్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో ఏపీలో గాలి ఎవరి వైపు ఉందో స్పష్టమయింది. ఫలితాలు ఎలా ఉన్నాయంటే ?

ABP CVoter Opinion Poll 2024 :  లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా నాడి ఎలా ఉందనేది తెలుసుకునేందుకు సామాన్య  ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నరు. దేశంలో అత్యంత విశ్వసనీయమైన సర్వేలు, ఒపీనియన్ పోల్స్ అందించే ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ మరోసారి ప్రజానాడి గుట్టు విప్పేందుకు ప్రయత్నించింది. ఏపీ వ్యాప్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

ఏపీలో ఎన్డీఏ కూటమి సునామీ ఖాయం 

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. వీటిలో ఎన్డీఏ కూటమి అత్యధికంగా 20 స్థానాలు గెల్చుకునే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో స్పష్టమయింది. బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తూండగా ఐదు చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీలు కలిసి పదిహేను స్థానాల్లో విజయం సాధిస్తాయి. జనసేన పార్టీ రెండు స్థానాల్లోనే పోటీ చేస్తున్నందున ఆ రెండు చోట్ల గెలిచినా.. టీడీపీ పదమూడు చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది.  

 

వైఎస్ఆర్‌సీపీకి ఐదు లోక్‌సభ సీట్లు

గత ఎన్నికల్లో 22 లోక్‌సభ సీట్లను గెలుచుకున్న వైఎస్ఆర్‌సీపీ ఈ సారి ఐదు అంటే 5 సీట్లకు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో స్పష్టమయింది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో విపక్షాలన్నీ ఏకమవడం.. అదే సమయంలో వైసీపీ అనుకూల ఓట్లు చీలిపోవడం కారణంగా ఆ పార్టీ దారుణంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ABP CVoter Opinion poll Andhra Pradesh : ఏపీలో ఎన్డీఏ కూటమి సునామీ ఖాయమా ? ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో సంచలన ఫలితాలు

ఎన్డీఏ కూటమికి 46.7 శాతం ఓట్లు

ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలసి పోటీ చేయడం వల్ల  ఓట్లు కన్సాలిడేట్ అయి ఆ కూటమి భారీ విజయాలు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు పార్టీలు కలిసి 46.7 సాతం ఓట్లు సాధిస్తాయని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో స్పష్టమయింది. 

వైఎస్ఆర్‌సీపీకి 39.9 శాతం ఓట్లు

ఇక గత ఎన్నికల్లో 49 శాతానికిపైగా ఓట్లు తెచ్చుకున్న వైఎస్ఆర్‌సీపీ పదిశాతం ఓట్ల వరకూ కోల్పోయినట్లుగా ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో తేలింది. ఈ సారి 39.9శాతం ఓట్లు రావచ్చని అంచనా . ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఎక్కువ ఓట్లు ఇతర పార్టీలకు వెళ్లిపోయాయి. ఆ ఓట్లలో కొన్ని షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పొందనుంది. అయితే షర్మిల ఎంత కష్టపడినా 1.9 శాతం ఓట్లే వస్తాయని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. 

ఇతరులకు 11.4 శాతం ఓట్లు 

ఈ సారి ఎపీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు, చిన్నా చితకా పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇతరులకు 11.4  శాతం వరకూ ఓట్లు వస్తాయని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. ఇందులో ఎవరికి ఓటు వేస్తామో చెప్పలేని వారు కూడా ఉన్నారు. 

మొత్తంగా ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌ పూర్తిగా లోక్ సభ ఎన్నికల దృష్టితోనే నిర్వహించారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల నిష్పత్తిలోనే అసెంబ్లీ ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా. 


(Methodology: Current survey findings and projections are based on CVoter Opinion Poll CATI interviews (Computer Assisted Telephone Interviewing) conducted among 18+ adults statewide, all confirmed voters, details of which are mentioned right below the projections as of today. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.)

 

టాప్ హెడ్ లైన్స్

AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
TDP First List: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
AP Local Body Polls: ఏపీ స్థానిక పోరులో రణరంగం.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
స్థానిక పోరులో మొదలైన రచ్చ.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget