అన్వేషించండి

Nobel Prize: నోబెల్ బహుమతి అంటే ఏమిటి? ఎవరికి ఇస్తారు?

Nobel Prize: భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శాంతి, సాహిత్యం, వైద్య శాస్త్రం, అర్థశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను నోబెల్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతి ప్రదానం చేస్తుంది.

What is a Nobel Prize: భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శాంతి, సాహిత్యం, వైద్య శాస్త్రం మరియు అర్థశాస్త్రం రంగాలలో నోబెల్ బహుమతి ప్రపంచంలోనే అత్యున్నత బహుమతి. ఈ అవార్డులలో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక సంస్థ అందిస్తుంది.  కరోలిన్స్‌కా ఇన్స్టిట్యూట్ వైద్య రంగంలో నోబెల్ బహుమతులను, భౌతిక శాస్త్రం, అర్థశాస్త్రం, రసాయన శాస్త్ర రంగాలలో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, నార్వేజియన్ నోబెల్ కమిటీ శాంతి రంగంలో నోబెల్ బహుమతులను అందిస్తుంది. ప్రతి నోబెల్ బహుమతి గ్రహీతకు ఒక మెడల్‌, ఒక డిప్లొమా, నగద పురస్కారం ప్రదానం చేస్తారు.

ఇది ఎలా ప్రారంభమైంది?

స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం నోబెల్ ఫౌండేషన్ ఈ అవార్డు ప్రదానం చేస్తుంది. 1896 డిసె౦బరులో ఆయన మరణి౦చడానికి ము౦దు, తన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని ఒక ట్రస్టు కోస౦ రిజర్వు చేశారు. మానవాళికి అత్య౦త ఉపయోగకరమైన పని గుర్తి౦చి వారికి ప్రతి స౦వత్సర౦ ఈ డబ్బు వడ్డీతో గౌరవి౦చాలని ఆయన కోరుకున్నారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శాంతి, సాహిత్యం, వైద్య శాస్త్రం, అర్థశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను నోబెల్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తుంది.

నోబెల్ ఫౌండేషన్ గురించి

నోబెల్ బహుమతులకు ఆర్థిక తోడ్పాటు అందివ్వడం దీని పని. 1900 జూన్ 29న నోబెల్ ఫౌండేషన్ ను స్థాపించారు. 1901 నుంచి నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. నోబెల్ ఫౌండేషన్ స్వీడన్ రాజు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందాన్ని కలిగి ఉంటుంది. మిగిలిన నలుగురు సభ్యులను ప్రైజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇనిస్టిట్యూట్ ధర్మకర్తలు ఎన్నుకుంటారు. స్టాక్ హోమ్ లో నోబెల్ బహుమతి స్వీడన్ రాజు చేతుల మీదుగా అందిస్తారు. కమిటీ ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో నోబెల్ గ్రహీతలను ప్రకటిస్తుంది,  ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10 న బహుమతి ప్రదానం జరుగుతుంది.

ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరు?

ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ 1833లో స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో జన్మించారు. 1867లో ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ ను కనుగొన్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన జీవితకాలంలో మొత్తం 355 ఆవిష్కరణలు చేసినప్పటికీ, అతను 1867 లో డైనమైట్  కనుగొన్నప్పటి నుంచే అత్యధిక పేరు, డబ్బు సంపాదించారు. 1896 డిసెంబరు 10న నోబెల్ ఇటలీలో గుండెపోటుతో మరణించారు.

అర్థశాస్త్రంలో నోబెల్ ప్రారంభం?

మొదట్లో నోబెల్ బహుమతి ఆర్థిక రంగంలో ఇచ్చేవాళ్లు కాదు. కానీ ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం 300వ వార్షికోత్సవం సందర్భంగా 1968లో స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఈ బహుమతిని ప్రారంభించింది. 1969లో నార్వేకు చెందిన రాగ్నర్ ఆంథోన్ కిటిల్ ఫ్రిష్, నెదర్లాండ్స్ కు చెందిన యాన్ టిర్బెర్గెన్‌కు అర్థశాస్త్రంలో తొలి నోబెల్ బహుమతి లభించింది.

నోబెల్ గెలుచుకున్న భారతీయులు

భారతదేశానికి చెందిన పది మంది ఇప్పటివరకు వివిధ కేటగిరీల్లో నోబెల్ బహుమతి అందుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ (సాహిత్యం) 1913లో ఈ అవార్డు అందుకున్న మొదటి యూరోపియన్ యేతర మొదటి భారతీయుడు. వీరితోపాటు వైద్య రంగంలో హర్‌గోబింద్‌ ఖురానా, భౌతిక శాస్త్రంలో సి.వి.రామన్, సాహిత్య రంగంలో వి.ఎ.ఎస్.నైపాల్, రసాయన శాస్త్రంలో వెంకట్ రామకృష్ణన్, శాంతి రంగంలో మదర్ థెరిస్సా, శాంతి రంగంలో సుబ్రమణ్య చంద్రశేఖర్, కైలాష్ సత్యార్థి, ఆర్.కె.పచౌరి, ఆర్థిక రంగంలో అమర్త్యసేన్, అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి వరించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Embed widget