UGC: ఆన్‌లైన్, దూరవిద్య కోర్సులను అందిస్తున్న వర్సిటీలివే, జాబితా విడుదల చేసిన యూజీసీ
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్, దూరవిద్య(ODL) ద్వారా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉన్నత విద్యను అందిస్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విడుదల చేసింది.
UGC Universities List: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్, దూరవిద్య(ODL) ద్వారా ఉన్నత విద్యను అందిస్తు్న్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల (Higher Educational Institutions) జాబితాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విడుదల చేసింది. యూజీసీ రెగ్యులేషన్స్,2020లోని నిబంధన 3(ఎ), 3(బి) కింద యూనివర్సిటీల నుంచి కోర్సుల గుర్తింపు కోసం దరఖాస్తులు కోరింది. ఈ నేపథ్యంలో కోర్సుల గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యాసంస్థల జాబితాను యూజీసీ తాజాగా విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచింది.
2023-24 విద్యాసంవత్సరానికిగాను మొత్తంగా 80 యూనివర్సిటీలకు సంబంధించి వివిధ ఆన్‌లైన్, డిస్టెన్స్ కోర్సులకు యూజీసీ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఫిబ్రవరి 2024 సెషన్‌కు సంబంధించి ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు మార్చి 31 వరకు అవకాశం ఉంది. విద్యాసంస్థలు ఏప్రిల్ 15లోగా ప్రవేశాలు పొందిన విద్యార్థులు వివరాలను యూజీసీ-డీఈబీ వెబ్‌పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆన్‌లైన్ లేదా దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలు కోరే విద్యార్థులు.. కోర్సుకు సంబంధించిన పూర్తివివరాలను క్షుణ్నంగా పరిశీలించుకోవాలని, యూజీసీ (UGC DEB) వెబ్‌సైట్‌లో కోర్సుల గుర్తింపు వివరాలను చూసుకోవచ్చని తెలిపింది.
యూజీసీ ఆమోదం తెలిపిన యూనివర్సిటీల వివరాల కోసం క్లిక్ చేయండి...
➥ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు) - 27 కోర్సులు, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి)-1 కోర్సు, విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్- టెక్నాలజీ అండ్ రిసెర్చ్ (డీమ్డ్ యూనివర్సిటీ)-1 కోర్సు, యోగివేమన యూనివర్సిటీ (కడప)-8 కోర్సులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం-తిరుపతి (సెంట్రల్ యూనివర్సిటీ)-8 కోర్సులు అందిస్తున్నాయి.
➥ తెలంగాణ నుంచి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ-హైదరాబాద్-11 కోర్సులు, ICFAI ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్-2 కోర్సులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-25 కోర్సులు, కాకతీయ యూనివర్సిటీ-28 కోర్సులకు యూజీసీ ఆమోదం తెలిపింది.
ALSO READ:
ఏపీ పీజీఈసెట్ 2024 దరఖాస్తు ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024(AP PGECET) నోటిఫికేషన్ మార్చి 17న వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 23న ప్రారంభమైంది. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఇక రూ.500 ఆలస్య రుసుముతో మే 28 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 5 వరకు.. చివరగా రూ.5000 ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సవరణకు మే 8 నుంచి 14 వరకు అవకాశం కల్పించారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/బీఫార్మసీ ఉత్తీర్ణత పొందిన/చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గేట్/జీప్యాట్ అర్హత సాధించిన అభ్యర్థులకు వేరుగా నోటిఫికేషన్ విడుదలచేస్తారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/బీఫార్మసీ ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తుకు అర్హులు. చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
పీజీఈసెట్ దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..