UGC NET Answer Key: యూజీసీ నెట్(జూన్)-2023 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
యూజీసీ నెట్ జూన్-2023 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ 'కీ'ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జులై 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది.
![UGC NET Answer Key: యూజీసీ నెట్(జూన్)-2023 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం! UGC NET June Answer Key 2023 out at ugcnet.nta.nic.in, download link here UGC NET Answer Key: యూజీసీ నెట్(జూన్)-2023 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/06/e6f2d820154dda8cb0112a85e1ec517d1688662311857522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యూజీసీ నెట్ జూన్-2023 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ 'కీ'ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జులై 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు ప్రశ్నపత్రాలను కూడా అందుబాటులో ఉంచారు. ఎన్‌టీఏ జూన్ 13 నుంచి జూన్ 22 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షను నిర్వహించి సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా 181 నగరాల్లోని పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించింది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 6,39,069 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉంటే జులై 6 నుంచి 8 లోగా ఆన్‌లైన్ ద్వారా నమోదుచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీతోపాటు పరీక్ష ఫలితాలను కూడా ఎన్టీఏ విడుదల చేయనుంది. దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను ఎన్‌టీఏ ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంటుంది.
యూజీసీ నెట్ జూన్ -2023 ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
ఆన్సర్ కీపై అభ్యంతరాలు నమోదుకు క్లిక్ చేయండి..
ALSO READ:
ఇంటిగ్రేటెడ్ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
9వ తరగతి నుంచి పీజీ వరకు స్కాలర్‌షిప్‌లు, నెలకు ఎంతవస్తుందో తెలుసా?
ఈ కాలంలో చదువు అంటే ఆర్థిక భారం మోయాల్సిందే. చిన్న పాటి ప్రైవేటు స్కూలులో, కాలేజీలు చేర్పించినా వేలకు వేలు ఫీజులు కట్టాల్సిందే. లక్షలు లేనిది ఉన్నతవిద్య అందడం లేదు. చాలా మంది విద్యార్థులు చదువుకు అయ్యే ఖర్చుకు భయపడి మధ్యలోనే మానేస్తుంటారు. కొంత మంది చదువులో బాగా రాణించినా తదుపరి విద్య కోసం డబ్బు పెట్టే స్తోమత లేక డ్రాపవుట్స్ గా మిగిలిపోతుంటారు. అలాంటి విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహించేందుకు తీసుకువచ్చినవే స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు. అర్హత, ప్రాంతం, అవసరానికి అనుగుణంగా దరఖాస్తు చేయడం ద్వారా స్కాలర్‌షిప్ లు పొందవచ్చు. చాలా స్కాలర్ షిప్‌లకు విద్యార్థి చదువులో ప్రతిభ కనబరచడమే అర్హత. మరికొన్ని స్కాలర్‌షిప్‌లకు చదువుతో పాటు వెనకబడిన కులాలకు చెందిన వారు అయి ఉండాలి. 9వ తరగతి నుంచి పీజీ లాంటి ఉన్నత విద్య అభ్యసించేంత వరకు రకరకాల స్కాలర్ షిప్ లు అందుబాటులో ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)