TS SSC Results District Wise: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ఈ జిల్లా టాప్! అట్టడుగున హైదరాబాద్ - ఉత్తీర్ణత శాతం ఎంతంటే
Telangana Tenth Results లో 9 ప్రైవేటు పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత, 3 జిల్లా పరిషత్ హై స్కూళ్లలో జీరో శాతం ఉత్తీర్ణత నమోదు అయింది.
తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పెద్ద ఎత్తున ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 87.61 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 92.45 గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో 97.87 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 79 శాతంతో చివరి స్థానంలో ఉండిపోయింది.
రాష్ట్రంలోని జిల్లా పరిషత్ హైస్కూళ్లలో 80 7.3 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 75 శాతం 65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని కేజీబీవీలలో 93.49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మైనార్టీ రెసిడెన్సిల్లో 93.73 శాతం, మోడల్ స్కూల్లో 97.25 శాతం ఉత్తీర్ణత, తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాల్లో 99.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీసీ గురుకులల్లో 97.47 మంది పాసయ్యారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలలో 95.3 శాతం మంది పాసయ్యారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 98.1 శాతం నమోదు అయింది.
9 ప్రైవేటు పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత, 3 జిల్లా పరిషత్ హై స్కూళ్లలో జీరో శాతం ఉత్తీర్ణత నమోదు అయింది.
Also Read: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు డేట్ ఫిక్స్, ఈ తేదీ నుంచే - మంత్రి వెల్లడి
జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం ఇదీ..
సిద్దిపేట - 97.85 శాతం
నిర్మల్- 97.73 శాతం
సంగారెడ్డి - 96.75 శాతం
కామారెడ్డి - 96.58 శాతం
ములుగు - 96.11 శాతం
హన్మకొండ - 96.07 శాతం
రాజన్న సిరిసిల్ల - 95.76 శాతం
జయశంకర్ భూపాలపల్లి - 95.59 శాతం
ఆదిలాబాద్ - 95.34 శాతం
జనగామ - 94.72 శాతం
మెదక్ - 94.44 శాతం
పెద్దపల్లి - 94.07 శాతం
యాదాద్రి భువనగిరి - 93.61 శాతం
నల్గొండ - 93.57 శాతం
కరీంనగర్ - 93.34 శాతం
నాగర్ కర్నూల్ - 93.00 శాతం
సూర్యాపేట - 93.00 శాతం
నిజామాబాద్ - 92.84 శాతం
వరంగల్ - 92.21 శాతం
మహబూబాబాద్ - 91.49 శాతం
జగిత్యాల - 91.37 శాతం
ఖమ్మం - 90.78 శాతం
మంచిర్యాల - 90.55 శాతం
వికారాబాద్ - 90.42 శాతం
రంగారెడ్డి - 90.04 శాతం
నారాయణ్ పేట - 88.63 శాతం
వనపర్తి - 88.56 శాతం
మహబూబ్ నగర్ - 88.47 శాతం
భద్రాద్రి కొత్తగూడెం - 86.83 శాతం
మేడ్చల్ మల్కాజ్ గిరి - 86.31 శాతం
జోగులాంబ గద్వాల్ - 85.64 శాతం
కొమురం భీం ఆసిఫాబాద్ - 79.99 v
హైదరాబాద్ - 79.63 శాతం