By: ABP Desam | Updated at : 30 Jun 2022 12:48 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం (Photo Credit: PTI)
తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి ఫెయిల్ అయిన వారి కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుంచి నిర్వహించనున్నట్లుగా మంత్రి సబిత ఈ సందర్భంగా ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. మీ పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ telugu.abplive.comలోకి లేదా bse.telangana.gov.in క్లిక్ చేయండి..
అంతేకాక, ప్రస్తుతం వచ్చిన మార్కులతో సంత్రుప్తి చెందకపోతే రీ వెరిఫికేషన్ కూడా విద్యార్థులు చేయించుకోవచ్చని వెల్లడించారు. రీ వెరిఫికేషన్ ఆన్సర్ షీట్లను జిరాక్స్ తీసి పంపుతామని కూడా మంత్రి వెల్లడించారు. ఇందుకోసం నిర్దేశిత ఫీజు చెల్లించాలని చెప్పారు.
ఉత్తీర్ణత శాతం ఇలా..
ఈ ఏడాది 5,03,579 విద్యార్థులు పది పరీక్షలు రాయగా, 4,53,201 మంది పాసైనట్లుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ఇందులో అబ్బాయిలు 2,55,433 మంది హాజరు కాగా.. 2,23,779 పాసయ్యారని వివరించారు. అమ్మాయిల్లో 2,48,146 మంది పరీక్షలు రాయగా, 2,29,422 మంది పాసైనట్లుగా వెల్లడించారు.
పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో అబ్బాయిలు 87 శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు. మొత్తం కలిపి 90 శాతం మంది పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వివరించారు.
టాప్‌లో సిద్దిపేట
జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో 97.87 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 79 శాతంతో చివరి స్థానంలో ఉండిపోయింది.
రాష్ట్రంలోని జిల్లా పరిషత్ హైస్కూళ్లలో 80 7.3 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 75 శాతం 65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని కేజీబీవీలలో 93.49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మైనార్టీ రెసిడెన్సిల్లో 93.73 శాతం, మోడల్ స్కూల్లో 97.25 శాతం ఉత్తీర్ణత, తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాల్లో 99.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీసీ గురుకులల్లో 97.47 మంది పాసయ్యారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలలో 95.3 శాతం మంది పాసయ్యారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 98.1 శాతం నమోదు అయింది. 9 ప్రైవేటు పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత, 3 జిల్లా పరిషత్ హై స్కూళ్లలో జీరో శాతం ఉత్తీర్ణత నమోదు అయింది.
NTR Health University: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!
NTRUHS PG Admissions: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్, చివరితేది ఇదే!
CUET UG Exam: విద్యార్థులకు అలర్ట్ - ఆ 11 వేల మందికి ఆగస్టు 30న పరీక్ష!
TS EAMCET 2022 Counselling Schedule: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలు ఇవే!
CM Jagan Review : రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్, సీఎం జగన్ ఆదేశాలు
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!