TS SET: టీఎస్ సెట్ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే
తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టీఎస్ సెట్ – 2023 పరీక్ష ఫలితాలు (TS SET 2023 Results) డిసెంబరు 6న విడుదలయ్యాయి.
TS SET Results 2023: తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టీఎస్ సెట్ – 2023 పరీక్ష ఫలితాలు (TS SET 2023 Results) డిసెంబరు 6న విడుదలయ్యాయి. ఈ మేరకు టీఎస్ సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ మురళీకృష్ణ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు వారి వ్యక్తిగత హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన రోజు తేదీలను ఎంటర్ చేసి స్కోర్ కార్డులను పొందవచ్చని పేర్కొన్నారు. అర్హత సాధించిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించే తేదీలను త్వరలోనే తమ వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామని వివరించారు.
PDF Question papers with Final Key
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీఎస్ సెట్)-2023 పరీక్ష హాల్‌టికెట్లను ఉస్మానియా యూనివర్సిటీ అక్టోబరు 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. టీఎస్ సెట్-2023 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్టికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 28 - 30 వరకు టీఎస్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు ప్రభుత్వం ఏటా టీఎస్ సెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పరీక్ష నిర్వహణ బాధ్యతను ఉస్మానియా విశ్వవిద్యాలయం చేపట్టింది.
పరీక్ష విధానం: మొత్తం 29 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
ALSO READ:
గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే
దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE)-2024 పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు(IISc) డిసెంబరు 5న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశ వ్యాప్తంగా 200 నగరాల్లో రెండు షిఫ్టుల్లో 'గేట్' పరీక్ష నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ పరీక్ష నిర్వహిస్తారనే షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష షెడ్యూలులో మారే అవకాశం ఉంది.
గేట్-2024 పరీక్ష పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..