అన్వేషించండి

Model School Admissions: 'మోడల్‌ స్కూల్స్' ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?

తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష-2024 దరఖాస్తు గడువును విద్యాశాఖ అధికారులు పొడిగించారు.

TS Model School Admissions: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష-2024 దరఖాస్తు గడువును విద్యాశాఖ అధికారులు పొడిగించారు. దరఖాస్తు ప్రక్రియ జనవరి 12న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 22తో గడువు ముగిసింది. అయితే విద్యార్థుల సౌలభ్యం మరో పదిరోజులు అంటే మార్చి 2 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.  విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 7న మోడల్ స్కూళ్లు ఉన్న మండల కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి,  మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతికి పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 25న వెల్లడిస్తారు.  ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జూన్ 1న లేదా 2023 - 24 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో 100 సీట్లలో (మొత్తంగా 19,400 సీట్లు) ప్రవేశాలు కల్పించనున్నారు. అలాగే 7-10 తరగతుల్లోని మిగిలిన ఖాళీలను సీట్లను భర్తీ చేస్తారు. ప్రతి తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో 50 చొప్పున విద్యార్థులు ఉంటారు.

వివరాలు...

* మోడల్‌ స్కూల్స్ ప్రవేశాలు - 2024

ప్రవేశాలు కల్పించే తరగతులు: 6, 7, 8, 9, 10.

వయోపరిమితి: 31.08.2024 నాటికి 6వ తరగతికి-10 సంవత్సరాలు, 7వ తరగతికి-11 సంవత్సరాలు, 8వ తరగతికి-12 సంవత్సరాలు, 9వ తరగతికి-13 సంవత్సరాలు, 10వ తరగతికి-14 సంవత్సరాలు నిండిపోయాలి.

పరీక్ష ఫీజు: రూ.200. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 100 ప్రశ్నలకుగాను 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు. 6వ తరగతికి (తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్&సోషల్(ఈవీఎస్), ఇంగ్లిష్) నుంచి మిగతా తరగతులవారికి (ఇంగ్లిష్,మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు.

Model School Admissions: తెలంగాణ 'మోడల్‌ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ వెల్లడి: 12.01.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.01.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.02.2024.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 01.04.2024.

➥ పరీక్ష తేదీ: 07.04.2024.

పరీక్ష సమయం:

➥ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి, 

➥ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతికి పరీక్షలు నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రం: అభ్యర్థులు వారివారి మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

➥  ఎంపిక జాబితా వెల్లడి: 25.05.2024.

➥ సర్టిఫికేట్ల పరిశీలన, ప్రవేశాలు: 27.05.2024 - 31.05.2024 వరకు.

➥ తరగతులు ప్రారంభం: అడకమిక్ క్యాలెండర్ ప్రకారం.

Notification - TSMS VI CLASS - 2024

Notification - TSMS VII TO X CLASS - 2024

Online Application and Fee Payment

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Embed widget