(Source: ECI/ABP News/ABP Majha)
MBBS Admissions: యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, ఆన్‌లైన్ దరఖాస్తు షెడ్యూలు ఇదే!
నీట్-2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్ 20న ఉదయం 10 గంటల నుంచి అక్టోబరు 27 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
తెలంగాణలో ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అక్టోబర్ 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్-2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అభ్యర్థులు అక్టోబర్ 20న ఉదయం 10 గంటల నుంచి అక్టోబరు 27 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితాను విడుదల చేస్తారు.
ఈ ఏడాది నుంచి యాజమాన్య కోటా మొత్తం సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను ఓపెన్ కేటగిరీలో అఖిల భారత స్థాయిలో అవకాశం కల్పిస్తారు. ఓపెన్ కేటగిరీలోనూ తెలంగాణ విద్యార్థులు పోటీ పడవచ్చని వర్సిటీ పేర్కొంది.
Notification
Online Application
PROSPECTUS
GOVERNMENT ORDERS ON ADMISSIONS AND FEE
Website
:: ఇవీ చదవండి ::
గురుకుల సైనిక మహిళా కళాశాలలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సు, అర్హతలివే!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల అందిస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎకనామిక్స్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లు, సైకో అనలిటికల్ టెస్ట్‌లు, మెడికల్ టెస్ట్‌లు, షార్ట్ లెక్చర్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Degree Courses: డిగ్రీలో కొత్త కోర్సులు, వచ్చే ఏడాది నుంచి అమల్లోకి!
తెలంగాణలోని యూనివర్సిటీల్లో మూస విద్యావిధానానికి స్వస్తి పలకాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే ఏడాదికల్లా కొలువులిచ్చే కోర్సుల రూపకల్పనకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ముగ్గురు వైస్‌చాన్స్‌లర్లతో త్రిసభ్య కమిటీని నియమించింది. శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్ చైర్మన్‌గా, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి సభ్యులుగా కమిటీ వేసింది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Cyber Security: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, అర్హతలివే!
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ' సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణను దరఖాస్తులు కోరుతోంది. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికెట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు అక్టోబరు 27 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 7893141797 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
CLISC: సీఎల్‌ఐఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్ అర్హత!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5 నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది.
కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..