మే 10న ఇంటర్, మే 15న టెన్త్ ఫలితాలు? కసరత్తులు చేస్తున్న విద్యాశాఖ అధికారులు!
తెలంగాణలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు ఇక ఫలితాలపై దృష్టి సారించారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది.
తెలంగాణలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు ఇక ఫలితాలపై దృష్టి సారించారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. దీంతో ఇక ఫలితాల విడుదలపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఎంసెట్, నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తిచేసి మే 10న ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూలు ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఏప్రిల్ 3న పదోతరగతి పరీక్షలు ప్రారంభించారు. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు ముగియగా. ఇక ఏప్రిల్ 11తో ఒకేషనల్ పరీక్షలు, ఏప్రిల్ 13తో ఓరియంటెల్ పరీక్షలు ముగిశాయి. మూల్యాంకన ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఈనేపథ్యంలో వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 21 వరకు మూల్యాంకనం చేపట్టి, ఆ తర్వాత టాబ్యులేషన్ నిర్వహించి మే 15న టెన్త్ ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు 4,84,384 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే దీనిపై అధికారుల నుంచి ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది.
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల..
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది. కటించిన క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. కాగా, ఇంటర్మీడియట్ విద్య కోసం ఈ ఏడాది మొత్తం 227 పని దినాలు ఉంటాయని బోర్డు తెలిపింది. ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. థియరీ పరీక్షలను మార్చి మొదటివారం నుంచి నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
ఇంటర్ పూర్తి క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..
Also Read:
సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)... 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ సిలబస్), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్ఈ సిలబస్)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
సిల్వర్ సెట్-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సిల్వర్ సెట్-2023' పరీక్షకు ఏప్రిల్ 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను మే 25న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తుకు అర్హులు.ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు భోజనం, వసతి అందిస్తారు. ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..