(Source: ECI/ABP News/ABP Majha)
Inter Academic Calender: ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.
ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. కాగా, ఇంటర్మీడియట్ విద్య కోసం ఈ ఏడాది మొత్తం 227 పని దినాలు ఉంటాయని బోర్డు తెలిపింది. ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. థియరీ పరీక్షలను మార్చి మొదటివారం నుంచి నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
తెలంగాణ ఇంటర్ అకడమిక్ ఇయర్ (2023-24) క్యాలెండర్ ..
➥ జూనియర్ కాలేజీల పునఃప్రారంభం: 01.06.2023.
➥ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ తరగతులు: 01.06.2023.
➥ దసరా సెలవులు: 19.10.2023 - 25.10.2023.
➥ దసరా సెలవుల తర్వాత పునఃప్రారంభం: 26.10.2023.
➥ అర్ధ సంవత్సర పరీక్షలు: 20.11.2023 - 25.11.2023.
➥ సంక్రాంతి సెలవులు: 13.01.2024 - 16.01.2024.
➥ సంక్రాంతి సెలవుల తర్వాత పునఃప్రారంభం: 17.01.2024.
➥ ప్రీ-ఫైనల్ పరీక్షలు: 22.01.2024 - 29.01.2024.
➥ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2024 ఫిబ్రవరి రెండవ వారం నుండి.
➥ ఇంటర్ థియరీ పరీక్షలు: 2024 మార్చి మొదటి వారం నుండి.
➥ వేసవి సెలవులు: 01.04.2024 - 31.05.2024.
➥ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2024 మే చివరి వారంలో
➥ 2024-25 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాలల పునఃప్రారంభ తేదీ: 01.06.2024.
ఏపీలో మూల్యాంకనం ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3తో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 4తో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. మాచవరంలోని ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం జరగుతోంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, గణితం, సివిక్స్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఇంటర్ విద్యామండలి నుంచి ఉత్తర్వులు అందుకున్న అధ్యాపకులు విధిగా హాజరవ్వాలని రవికుమార్ ఇదివరకే ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్స్, ప్రైవేటు యాజమాన్యాలు.. తమ అధ్యాపకులు విధులకు హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అధ్యాపకులను పంపని కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.
Also Read:
సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)... 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ సిలబస్), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్ఈ సిలబస్)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.