అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

TS ICET -2023: టీఎస్ ఐసెట్ 'స్పెషల్' కౌన్సెలింగ్ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన టీఎస్‌ఐసెట్ కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్ల భర్తీకి 'ప్రత్యేక విడత' కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 15న ప్రారంభమైంది.

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన టీఎస్‌ఐసెట్ కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్ల భర్తీకి 'ప్రత్యేక విడత' కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 15న ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబ‌ర్ 15న ప్రాథమిక సమాచారం ఆన్‌లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ఉంటుంది. అక్టోబ‌ర్ 16న ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్టోబ‌ర్ 16 నుంచి 17 వ‌ర‌కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. అక్టోబ‌ర్ 17 వెబ్ ఆప్షన్లు ఫ్రీజింగ్ చేసుకోవాలి. వెబ్‌ఆప్షనలు నమోదుచేసుకున్నవారికి అక్టోబ‌ర్ 20న సీట్లను కేటాయిస్తారు.

సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబ‌ర్ 20 నుంచి 29 వ‌ర‌కు నిర్ణీత ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలలో 'సెల్ఫ్ రిపోర్టింగ్' చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్టోబ‌ర్ 30 నుంచి 31 వ‌ర‌కు అభ్యర్థులకు కేటాయించిన కళాశాలలో నేరుగా రిపోర్టింగ్‌ చేయాలి. అక్కడ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.  ఎంబీఏ, ఎంసీఏ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ సీట్ల కోసం అక్టోబ‌ర్ 30న స్పాట్ అడ్మిష‌న్ల మార్గద‌ర్శకాలు విడుదల చేయనున్నారు. ఆ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. కౌన్సెలింగ్‌లో పాల్గొనదలచినవారు ఐసెట్ హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, ఆధార్ కార్డు, విద్యార్హతకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఇతర అవసరమైన అన్ని ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. 

ఐసెట్ 'ప్రత్యేక' కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ ప్రాథమిక సమాచారం ఆన్‌లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్: అక్టోబ‌ర్ 15.

➥ సర్టిఫికెట్ వెరిఫికేషన్: అక్టోబ‌ర్ 16.

➥ వెబ్ ఆప్షన్ల నమోదు:  అక్టోబ‌ర్ 16, 17 తేదీల్లో

➥ వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్:  అక్టోబ‌ర్ 17.

➥ సీట్ల కేటాయింపు: అక్టోబ‌ర్ 20.

➥ సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: అక్టోబ‌ర్ 20 నుంచి 29 వరకు.

➥ కళాశాలలో రిపోర్టింగ్: అక్టోబ‌ర్ 30, 31 తేదీల్లో.

➥ స్పాట్ అడ్మిష‌న్ల మార్గద‌ర్శకాలు: అక్టోబ‌ర్ 30న. 

Counselling Notification

Website

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 26, 27 తేదీల్లో నిర్వహించిన 'టీఎస్ ఐసెట్‌-2023' పరీక్ష ఫలితాలు జూన్ 29న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రవేశపరీక్షలో మొత్తం 61,092 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సెప్టెంబరు 6న ఐసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకాగా..  సెప్టెంబ‌రు 15న‌ సీట్లను కేటాయించారు. ఎంబీఏలో 87.33 శాతం కన్వీనర్‌ కోటా సీట్లు భర్తీకాగా, ఎంసీఏలో అన్ని సీట్లు నిండాయి. ఎంబీఏలో 24,029 సీట్లకు 20,985, ఎంసీఏలో 3,009 సీట్లకు అన్నీ భర్తీ అయ్యాయి. వాటిల్లో 902 మంది ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద సీట్లు పొందారు. మొత్తం 255 కళాశాలల్లో 80 చోట్ల అన్నీ సీట్లు నిండాయి.

ఇక రెండో విడత సీట్ల కేటాయింపులో  ఎంబీఏ కోర్సులో మొత్తం 21,983 సీట్లు భర్తీ కాగా, ఎంసీఏ కోర్సులో 2865 సీట్లు భర్తీ అయ్యాయి. ఎంసీఏ సీట్లు వంద శాతం భర్తీకాగా ఎంబీఏ సీట్లు మాత్రం 2295 సీట్లు మిగిలాయి. 83 కాలేజీల్లో వంద శాతం సీట్లు నిండాయి. అందులో 15 యూనివర్సిటీలు ఉండగా, 68 ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 254 ఎంబీఏ కాలేజీల్లోని 24278 సీట్లల్లో 21983 సీట్లు భర్తీ అయ్యాయి. 48 ఎంసీఏ కాలేజీల్లోని 2865 సీట్లల్లో వంద శాతం నిండాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Embed widget