అన్వేషించండి

Dussehra Holidays: స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు ఖరారు, ఎన్నిరోజులంటే? ఏపీలో ఇలా!

తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు, జూనియర్ కాలేజీలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది.

తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు, జూనియర్ కాలేజీలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అక్టోబరు 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని సూచించింది. ఇక రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు మాత్రం 7 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబరు 19 నుంచి 25 వరకు సెలవులివ్వాలని విద్యాశాఖ పేర్కొంది.

ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ ముందుగానే ప్రకటించింది. తెలంగాణలో దసరా సెలవులు 2022లో 14 రోజులు ఉండగా..2023లో మాత్రం 13 రోజులే ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకు బతుకమ్మ, దసరా సెలవులు ఉండనున్నాయి. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తెరుచుకోనున్నాయి. తెలంగాణలో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ సెలవుల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ పొందిపరిచింది.

ఏపీలో 11 రోజుల దసరా సెలవులు..
ఏపీలోని పాఠశాలలకు ఈ సారి 11 రోజులపాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌కు అక్టోబరు 14 నుంచి 24 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఇక ఏపీలోని ఇంటర్ కాలేజీలకు కూడా తెలంగాణ మాదిరిగా.. అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.

ALSO READ:

ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు అవకాశం
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థుల కోసం నిర్దేశించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. డిసెంబరు 10న జరిగే పరీక్షకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అర్హులని, రెసిడెన్షియల్‌ విధానంలో చదువుతున్న వారికి అర్హత లేదని తెలిపారు. ఈసారి తొలిసారిగా ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచుతున్నామని వెల్లడించారు. దానివల్ల స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యే ఎస్టీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు నిర్వహిస్తూ వస్తున్న ఫార్మాటివ్, సమ్మేటివ్ పరీక్షలను.. పీరియాడిక్, టర్మ్ పరీక్షలుగా మార్చింది. పీరియాడిక్ రాత పరీక్ష (పీడబ్ల్యూటీ)-2 అక్టోబరు 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. సీబీఎస్ఈ గుర్తింపు పొందిన ప్రభుత్వ స్కూళ్లలో ఈ కొత్త పరీక్షల విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ కొత్త విధానంలో మొత్తం నాలుగు పీడబ్ల్యూటీలు, రెండు టర్మ్ పరీక్షలు ఉంటాయి. టర్మ్-1 నవంబరులో, టర్మ్-2 పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. టర్మ్ పరీక్షలో 80 మార్కులకు రాతపరీక్షలు, 20 మార్కులకు అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాతపరీక్షలు, 10 మార్కులకు అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget