By: ABP Desam | Updated at : 03 Oct 2023 05:27 PM (IST)
Edited By: omeprakash
ఏపీ సీబీఎస్ఈ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు నిర్వహిస్తూ వస్తున్న ఫార్మాటివ్, సమ్మేటివ్ పరీక్షలను.. పీరియాడిక్, టర్మ్ పరీక్షలుగా మార్చింది. పీరియాడిక్ రాత పరీక్ష (పీడబ్ల్యూటీ)-2 అక్టోబరు 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు.
పీడబ్ల్యూటీ పరీక్షలు ఇలా..
సీబీఎస్ఈ గుర్తింపు పొందిన ప్రభుత్వ స్కూళ్లలో ఈ కొత్త పరీక్షల విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ కొత్త విధానంలో మొత్తం నాలుగు పీడబ్ల్యూటీలు, రెండు టర్మ్ పరీక్షలు ఉంటాయి. టర్మ్-1 నవంబరులో, టర్మ్-2 పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. టర్మ్ పరీక్షలో 80 మార్కులకు రాతపరీక్షలు, 20 మార్కులకు అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాతపరీక్షలు, 10 మార్కులకు అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
'పది'లో స్కిల్ సబ్జెక్టు..
ఈ కొత్త విధానం ప్రకారం పదోతరగతిలో 5 సబ్జెక్టులు మాత్రమే ఉండనున్నాయి. మొదటి భాషగా ఇంగ్లిష్, రెండో భాషగా తెలుగు ఉంటుంది. అయితే మూడో భాష హిందీ ఉండదు. ఆరో సబ్జెక్టుగా స్కిల్ సబ్జెక్టును అమలు చేయనున్నారు. ఈ సబ్జెక్టుకు సంబంధించి 50 మార్కులకు థియరీ పరీక్ష, 50 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యార్థులకు గ్రేడ్లు ఇలా..
మార్కులు | గ్రేడ్లు |
91-100 | A1 గ్రేడ్ |
81-90 | A2 గ్రేడ్ |
71-80 | B1 గ్రేడ్ |
61-70 | B2 గ్రేడ్ |
51-60 | C1 గ్రేడ్ |
41-50 | C2 గ్రేడ్ |
33-40 | D గ్రేడ్ |
ALSO READ:
ఏపీలో 11 రోజుల దసరా సెలవులు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే? తెలంగాణలో రెండు రోజులు ఎక్కువే!
ఏపీలోని పాఠశాలలకు ఈ సారి 11 రోజులపాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌కు అక్టోబరు 14 నుంచి 24 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. అయితే రాష్ట్రంలో అక్టోబరు 3 నుంచి 6 వరకు నిర్వహించాల్సిన ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ)–2 పరీక్షలను అక్టోబరు 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్ల పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్ష నమూనాలో చేసిన మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసమే తేదీల మార్పులు చేశామని అధికారులు తెలిపారు. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు అవకాశం
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థుల కోసం నిర్దేశించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. డిసెంబరు 10న జరిగే పరీక్షకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అర్హులని, రెసిడెన్షియల్ విధానంలో చదువుతున్న వారికి అర్హత లేదని తెలిపారు. ఈసారి తొలిసారిగా ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచుతున్నామని వెల్లడించారు. దానివల్ల స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యే ఎస్టీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
AP Tenth: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!
TS SET: టీఎస్ సెట్ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్లోడ్ లింక్ ఇదే
GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే
CPGET: పీజీ సీట్లు సగానికి పైగా ఖాళీ, అయినా ప్రవేశాలు గతేడాది కంటే ఎక్కువే!
AP Inter Fees: ‘ఇంటర్’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
/body>