Dasara Holidays in AP: ఏపీలో 11 రోజుల దసరా సెలవులు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే? తెలంగాణలో రెండు రోజులు ఎక్కువే!
ఏపీలోని పాఠశాలలకు ఈ సారి 11 రోజులపాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌కు అక్టోబరు 14 నుంచి 24 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది.
ఏపీలోని పాఠశాలలకు ఈ సారి 11 రోజులపాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌కు అక్టోబరు 14 నుంచి 24 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. అయితే రాష్ట్రంలో అక్టోబరు 3 నుంచి 6 వరకు నిర్వహించాల్సిన ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ)–2 పరీక్షలను అక్టోబరు 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్ల పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్ష నమూనాలో చేసిన మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసమే తేదీల మార్పులు చేశామని అధికారులు తెలిపారు. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.
ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం సమయంలో. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మద్యాహ్నం పరీక్షలు ఉంటాయి.
ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్లైన్ పోర్టల్‌లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని సూచించింది.
ఏపీలో పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ వివరాలు ఇలా..
తెలంగాణలో 13 రోజులు దసరా, బతుకమ్మ సెలవులు..
ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ ముందుగానే ప్రకటించింది. తెలంగాణలో దసరా సెలవులు 2022లో 14 రోజులు ఉండగా..2023లో మాత్రం 13 రోజులే ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకు బతుకమ్మ, దసరా సెలవులు ఉండనున్నాయి. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తెరుచుకోనున్నాయి. తెలంగాణలో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌లో ఈ సెలవుల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ పొందిపరిచింది.
ALSO READ:
GATE - 2024 దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్)-2024 దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా అక్టోబర్ 5లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌టెండెడ్ పీరియడ్‌తో అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్ పరీక్షలను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది.
దరఖాస్తు, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు అవకాశం
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థుల కోసం నిర్దేశించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. డిసెంబరు 10న జరిగే పరీక్షకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అర్హులని, రెసిడెన్షియల్ విధానంలో చదువుతున్న వారికి అర్హత లేదని తెలిపారు. ఈసారి తొలిసారిగా ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచుతున్నామని వెల్లడించారు. దానివల్ల స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యే ఎస్టీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలుగు యూనివర్సిటీ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలు
హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 'స్పాట్ అడ్మిషన్స్' నిర్వహిస్తోంది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. లలితకళా రంగంలో ఎంపీఏ (కూచిపూడి, జానపదం, రంగస్థలం, సంగీతం), సామాజిక తదితర శాస్త్రాల విభాగంలో జ్యోతిషం, ఎంఏ (లింగ్విస్టిక్స్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నవంబరు 25లోగా ఆయా వర్సిటీ ప్రాంగణాల్లో సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..