EAMCET:ఇంజినీరింగ్ రెండో దశ సీట్లు కేటాయింపు; 21వేల సీట్లు భర్తీ, మరో 14 వేల సీట్లు మిగులు
మొదటి విడతలో సీట్లు పొందిన 42,998 మంది కలిపి మొత్తం 64,134 మందికి సీట్లు పొందారు. మొదటి విడతలో సీట్లు పొందిన వారిలో 20 శాతం మంది వరకు కళాశాలలు, బ్రాంచీలు మారారని అధికారులు తెలిపారు.
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు అక్టోబరు 16న సీట్లు కేటాయించారు. మొత్తం 21,136 మంది విద్యార్థులు కొత్తగా సీట్లు పొందారు. మొదటి విడతలో సీట్లు పొందిన 42,998 మంది కలిపి మొత్తం 64,134 మందికి సీట్లు పొందారు. మొదటి విడతలో సీట్లు పొందిన వారిలో 20 శాతం మంది వరకు కళాశాలలు, బ్రాంచీలు మారారని అధికారులు తెలిపారు. రెండో విడతలో 53,848 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో కొత్తగా 3,547 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరై ఆప్షన్లు నమోదుచేసుకున్నారు. తగినన్ని ఆప్షన్లు ఇవ్వని 4,590 మందికి సీట్లు రాలేదు. మొత్తం కన్వీనర్ సీట్లలో 81.87% భర్తీ అయ్యాయి.
రెండో విడతలో సీట్లు పొందినవారు అక్టోబర్ 18 లోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి అదే విధానంలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. చివరి విడత సీట్ల కేటాయింపు తర్వాతే అభ్యర్థులు ఆయా కళాశాలలకు స్వయంగా వెళ్లి రిపోర్ట్ చేయాలి. మొదటి విడతలో సీట్లు పొంది ఫీజు చెల్లించిన వారు రెండో విడతలో మరో కళాశాలలో సీటు వస్తే ఫీజు వ్యత్యాసం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు తగ్గితే చివరి విడత తర్వాత విద్యార్థులకు చెల్లిస్తారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 5,265 మందికి సీట్లు దక్కాయి. క్రీడా, ఎన్‌సీసీ కోటాకు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ప్రాధాన్యాలు రానందున చివరి విడత కౌన్సెలింగ్‌లో వారికి సీట్లు కేటాయిస్తారు.
రెండో విడత సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..
సీట్ల వివరాలు క్లుప్తంగా..
మొత్తం కళాశాలలు | 177 |
కన్వీనర్ సీట్లు | 78,336 |
భర్తీ అయిన సీట్లు | 64,134 (81.87%) |
మిగిలిపోయిన సీట్లు | 14,202 |
16 ప్రభుత్వ కళాశాలల్లో సీట్ల వివరాలు | 4,845 సీట్లలో 3,836 భర్తీ |
ఒక విశ్వవిద్యాలయం, 32 ప్రైవేట్ కళాశాలల్లో | 100% సీట్లు భర్తీ |
ఇంజినీరింగ్ బ్రాంచ్ | సీట్ల సంఖ్య | భర్తీ అయిన సీట్లు |
సీఎస్ఈ | 20,001 | 19,551 (97.75%) |
ఐటీ | 5,287 | 5,169 (97.97%) |
సీఎస్‌ఈ (డేటాసైన్స్) | 5,572 | 5,317 (95.42%) |
సీఎస్‌ఈ (ఏఐ-ఎంఎల్) | 9,588 | 8,723 (90.98%) |
సీఎస్‌ఈ (సైబర్) | 2,194 | 2,074 (94.53%) |
ఏఐ, ఎంఎల్ | 2,131 | 1540 (72.27%) |
ఈసీఈ | 12,331 | 10,885 (88.27%) |
ఈఈఈ | 5,778 | 3,087 (53.43%) |
సివిల్ | 5,000 | 1734 (34.68%) |
మెకానికల్ | 4,592 | 1322 (28.79%) |
:: ఇవీ చదవండి ::
TSPECET: టీఎస్‌పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే!
తెలంగాణలో వ్యాయామ విద్య (ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 19 నుంచి నవంబరు 2 వరకు కౌన్సెలింగ్ జరుగనుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా అక్టోబరు 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ 2022-23 కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అక్టోబరు 17న విడుదల కానుంది. తెలంగాణ ప్రవేశాల కమిటీ విడుదలచేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 నుంచి 26 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. అక్టోబరు 26 నుంచి 28 వరకు స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. అనంతరం అక్టోబరు 28న అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..