TS EAMCET: టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీ పొడిగింపు, వాళ్ల కోసమే!
సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం కౌన్సిలింగ్ పొడిగించారు. ఇంటర్ పాసైన విద్యార్థులు తమ సర్లిఫికేట్ల వెరిఫికేషన్ కోసం ప్రాసెసింగ్ రుసుము చెల్లించి.. స్లాట్ బుకింగ్ చేసుకొనే గడువును..
TS EAMCET Counseling: తెలంగాణలో ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తేదీలను పొడిగించారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఆగస్టు 30న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం కౌన్సిలింగ్ పొడిగించారు. ఇంటర్ పాసైన విద్యార్థులు తమ సర్లిఫికేట్ల వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి.. స్లాట్ బుకింగ్ చేసుకొనే గడువును సెప్టెంబరు 1 వరకు పెంచారు. సెప్టెంబరు 2 వరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగనుంది.
Also Read: ఏపీ హార్టీసెట్ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
అలాగే వెబ్‌ఆప్షన్ల గడువును సెప్టెంబరు 3 వరకు పొడిగించినట్లు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ ఆగస్టు 30న ఒక ప్రకటనలో తెలిపారు. ఇక కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఆగస్టు 29 వరకు 74 వేల 773 మంది స్లాట్ బుక్ చేసుకొని.. వారిలో 62 వేల 383 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు.
ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఆగస్టు 21న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 21 నుంచి 29 వరకు ఆన్ లైన్ కౌన్సెలింగ్ రుసుము చెల్లించి ధ్రువపత్రాల కోసం స్లాట్ బుకింగ్ తర్వాత.. 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఆగస్టు 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. కాగా.. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం మళ్లీ కౌన్సెలింగ్ తేదీలను పొడిగించారు.
Also Read: NTR Health University: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!
ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల గడువు సెప్టెంబరు 5 వరకు పొడిగించినట్లు కన్వీనర్ నాగరాణి ఆగస్టు 28న ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్‌లో భాగంగా రిజిస్ట్రేషన్, విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కళాశాలలు, కోర్సుల ఎంపికపై వెబ్ ఆప్షన్ల నమోదుకు ఆగస్టు 28 నుంచి విద్యార్థులకు అవకాశం కల్పించాల్సి ఉండగా.. ఇది వాయిద
కాకినాడ, అనంతపురం జేఎన్‌టీయూల పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తికాలేదు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు రాలేదు. కాకినాడ జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు ఫీజులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిల్లో కనీసం 25 శాతమైనా చెల్లించాలని వర్సిటీ ఆదేశించింది. చాలా కాలేజీలు చెల్లించకపోవడంతో అనుబంధ గుర్తింపు జారీని నిలిపివేసింది. దీంతో కొన్ని కళాశాలలతో కూడిన జాబితానే సాంకేతిక విద్యాశాఖకు చేరింది. ఈ కారణాల రీత్యా రిజిస్ట్రేషన్ గడువును పొడిగించారు. ఇప్పటి వరకు 79,864 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.
Read Also: స్విమ్స్'లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు మొదట ఎంపీసీ స్ట్రీమ్ ప్రవేశాలకు సంబంధించి ఆగస్టు 22 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కౌన్సెలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 25 సహాయకేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ ఏడాది ఈఏపీసెట్(ఏపీ ఎంసెట్) పరీక్షకు 2,82,496 మంది హాజరుకాగా.., 2,56,983 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇంజినీరింగ్ విభాగంలో 89.12 శాతం అర్హత సాధించారు. అదేవిధంగా ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగంలో 87,744 మంది పరీక్షకు హాజరుకాగా.. 83,411 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 95.06 శాతం అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,06,579 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,94,752 మంది పరీక్ష రాశారు. వీరిలో 1,73,572 మంది క్వాలిఫై అయ్యారు. ఎంపీసీ స్ట్రీమ్ అభ్యర్థులకు మొదట కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 1.48 లక్షల సీట్లను భర్తీచేస్తారు.
Also Read: NTR Health University: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ఇలా..
✈ ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: ఆగస్టు 22 నుంచి ఆగస్టు 30 వరకు
✈ సర్టిఫికెట్ల పరిశీలన: ఆగస్టు 23 - 31
✈ కాలేజీలు, కోర్సుల ఎంపికకు ఆప్షన్ల నమోదు: ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 2 వరకు
✈ వెబ్ ఆప్షన్లలో మార్పు: సెప్టెంబరు 3న
✈ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 6న
✈ కాలేజీల్లో రిపోర్టింగ్: సెప్టెంబరు 6 - 12
✈ ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం: సెప్టెంబరు 12 నుంచి
NOTE: ఆగస్టు 28 నుంచి జరగాల్సిన వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ, ఆప్షన్లలో మార్పు, సీట్ల కేటాయింపు, కాలేజీలో రిపోర్టింగ్ ప్రక్రియను వాయిదావేశారు.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..