అన్వేషించండి

TS EAMCET: రేపటి నుంచి ఇంజినీరింగ్‌ వెబ్‌ఆప్షన్ల నమోదు, ఎప్పటివరకంటే?

తెలంగాణ ఎంసెట్‌కు సంబంధించి ఇంజినీరింగ్‌లో చేరాలనుకున్న విద్యార్థులు జూన్ 28 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర విద్యాశాఖ అవకాశం కల్పించింది.

తెలంగాణ ఎంసెట్‌కు సంబంధించి ఇంజినీరింగ్‌లో చేరాలనుకున్న విద్యార్థులు జూన్ 28 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర విద్యాశాఖ అవకాశం కల్పించింది. రాష్ట్రంలో భర్తీ చేయబోయే ఇంజినీరింగ్ సీట్ల వివరాలను ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 137 ప్రైవేటు కళాశాలల్లో 80,091 సీట్లు భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని 16 యూనివర్సిటీ కాలేజీల్లో 4,713 సీట్లు, రెండు ప్రైవేట్ వర్సిటీల్లో 1,302 సీట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 62,079 సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అత్యధికంగా సీఎస్‌ఈలో 15,897, ఈసీఈలో 9,734 సీట్లు ఉన్నట్లు తెలిపింది.

తెలంగాణలో ఎంసెట్-2023 ప్రవేశాల కౌన్సెలింగ్ జూన్ 26న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు జూన్ 26 నుంచి జులై 5 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులకు జూన్ 28 నుంచి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇది పూర్తయినవారు అభ్యర్థులు 28 నుంచి జులై 8 వరకు కళాశాలల్లో సీట్ల ఎంపికపై ఐచ్ఛికాలను (వెబ్ ఆప్షన్లు) నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 26 నుంచి జులై 19 మొదటివిడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తర్వాత జులై 21 నుంచి 31 వరకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇక చివరగా మిగిలిన సీట్ల భర్తీకి  ఆగస్టు 2 నుంచి 9 వరకు చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అదేవిధంగా స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఆగస్టు 8న విడుదల చేయనున్నారు.

సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఇవి అవసరం:

  • ఎంసెట్ హాల్ టికెట్
  • ఆధార్ /పాన్ కార్డు/డ్రైవింగ్  లైసెన్స్  తదితర ఒక గుర్తింపు కార్డు
  • ఎంసెట్ ర్యాంకు కార్డు
  • ఇంటర్ మార్కుల పత్రం
  • టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్)
  • పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో.
  • 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్
  • రిజర్వేషన్ వర్తిస్తే కుల ధ్రువీకరణ పత్రం
  • ఈడబ్ల్యూఎస్ వర్తిస్తే ఆ ధ్రువపత్రం

Online Registration

Counselling Website

మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ జూన్ 26 - జులై 5 వరకు: ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది.

➥ జూన్ 28 – జులై 6: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

➥ జూన్ 28 – జులై 8: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్ష‌న్స్ (వెబ్‌ఆప్షన్స్)ఎంచుకోవాల్సి ఉంటుంది.

➥ జులై 8: ఆప్ష‌న్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.

➥ జులై 12: సీట్ల కేటాయింపు.

➥ జులై 12 – 19: సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ జులై 21 – 22: ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్ర‌మే).

➥ జులై 23: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

➥ జులై 21 – జులై 24: స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్ష‌న్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

➥ జులై 24: ఆప్ష‌న్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.

➥ జులై 28: సీట్ల కేటాయింపు

➥ జులై 28 – 31: సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ ఆగ‌స్టు 2: ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు సంబంధించి తేదీ, స‌మ‌యం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫ‌స్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివ‌రాలు నింప‌ని విద్యార్థులు మాత్ర‌మే).

➥ ఆగ‌స్టు 3: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

➥ ఆగ‌స్టు 2: ఆగ‌స్టు 4 – స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ పూర్త‌యిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్ష‌న్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

➥ ఆగ‌స్టు 4: ఆప్ష‌న్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.

➥ ఆగ‌స్టు 7: సీట్ల కేటాయింపు.

➥ ఆగ‌స్టు 7 – ఆగ‌స్టు 9: సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మ‌ధ్య‌లో ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

స్పాట్ ప్రవేశాలు...
స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను ఆగస్టు 8 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

Counselling Notification

ఈ ఏడాది నిర్వహించిన ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షకు 1,95,275 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షకు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అగ్రికల్చర్ & ఫార్మా విభాగంలో 91,935 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 1,57,879 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 

టాప్ హెడ్ లైన్స్

AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Bhuvi Comeback Masterstroke: అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
Embed widget